Telugu Global
National

కేరళపై కేంద్రం ఆగ్రహం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మే 3వరకు లాక్‌డౌన్‌ను పొడిగించినప్పటికీ… కేరళ ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్దంగా కొన్ని ప్రాంతాల్లో వ్యవహరించడంపై కేంద్రం సీరియస్ అయింది. కేరళ సీఎస్‌కు కేంద్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. కేరళ ప్రభుత్వ నిర్ణయాలు కరోనాపై పోరును నీరుగార్చేలా ఉన్నాయని అభ్యంతరం తెలిపింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించకుండా సొంతంగా రాష్ట్రాలు నిబంధనలను సడలించడం సరికాదని స్పష్టం చేసింది. […]

కేరళపై కేంద్రం ఆగ్రహం
X

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మే 3వరకు లాక్‌డౌన్‌ను పొడిగించినప్పటికీ… కేరళ ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్దంగా కొన్ని ప్రాంతాల్లో వ్యవహరించడంపై కేంద్రం సీరియస్ అయింది. కేరళ సీఎస్‌కు కేంద్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది.

కేరళ ప్రభుత్వ నిర్ణయాలు కరోనాపై పోరును నీరుగార్చేలా ఉన్నాయని అభ్యంతరం తెలిపింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించకుండా సొంతంగా రాష్ట్రాలు నిబంధనలను సడలించడం సరికాదని స్పష్టం చేసింది.

కేరళ ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో రెస్టారెంట్లు, బార్బర్‌ షాపులు, బుక్‌ షాపులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. సిటీ బస్సు సర్వీసులను కొన్ని చోట్ల పాక్షికంగా అనుమతించింది. వెనుక సీట్లలో ప్రయాణికులను కూర్చోబెట్టుకుని కారులో వెళ్లేందుకు సడలింపు ఇచ్చింది.

ఈ సడలింపులు కేంద్రం దృష్టికి వెళ్లడంతో స్పందించింది. ఏ రాష్ట్రం కూడా సొంతంగా లాక్‌ డౌన్ నిబంధనలను ఏర్పరుచుకోవడానికి వీల్లేదని… కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని కేంద్రం తన లేఖలో స్పష్టం చేసింది.

First Published:  20 April 2020 5:34 AM IST
Next Story