Telugu Global
National

ఒక్క రోజే 552 కేసులు... మహారాష్ట్రలో కరోనా కల్లోలం

మహారాష్ట్ర లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 552 కరోనా పాజిటివ్ కేస్ లు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకూ మహారాష్ట్రలో నమోదైన కేసుల సంఖ్య 4,200కి చేరింది. ఇప్పటివరకూ 211 మంది చనిపోయారు. 507 మంది డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం ఒక్క రోజే 110 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1893కి చేరింది. ఇప్పటివరకూ 45 […]

ఒక్క రోజే 552 కేసులు... మహారాష్ట్రలో కరోనా కల్లోలం
X

మహారాష్ట్ర లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 552 కరోనా పాజిటివ్ కేస్ లు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకూ మహారాష్ట్రలో నమోదైన కేసుల సంఖ్య 4,200కి చేరింది. ఇప్పటివరకూ 211 మంది చనిపోయారు. 507 మంది డిశ్చార్జ్ అయ్యారు.

మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం ఒక్క రోజే 110 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1893కి చేరింది. ఇప్పటివరకూ 45 మంది మృతి చెందారు.

ఇటు కేరళలో కేసుల సంఖ్య తగ్గడంతో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేస్తోంది. సోమవారం నుంచి కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తోంది. అయితే సరి-బేసి విధానం అమలు చేయబోతోంది. ఇప్పటికే రాష్ట్రాని నాలుగు జోన్ లు గా విభజించింది కేరళ ప్రభుత్వం. రెడ్‌, ఆరెంజ్‌ ఏ, ఆరెంజ్‌ బి, గ్రీన్‌ జోన్ లు గా విభజించింది.

హాట్ స్పాట్‌ పరిధిలో లేని ప్రాంతాల్లో మాత్రమే వాహనాలకు అనుమతి ఇస్తారు. ప్రైవేటు వాహనాలకు జిల్లా పరిధిలో మాత్రమే పర్మిషన్‌ ఇస్తారు.

First Published:  20 April 2020 1:43 AM IST
Next Story