Telugu Global
Cinema & Entertainment

దేవరకొండ ఇలా కూడా క్లిక్ అవ్వలేకపోయాడు

హీరో విజయ్ దేవరకొండకు ప్రస్తుతం బ్యాడ్ డేస్ నడుస్తున్నట్టున్నాయి. భారీ అంచనాల మధ్య తీసిన డియర్ కామ్రేడ్ ఫెయిలైంది. ఆ తర్వాత చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ అయితే డిజాస్టర్ అయింది. దీంతో పూర్తిగా డైలమాలో పడిపోయాడు దేవరకొండ. కట్ చేస్తే, ఇప్పుడు అదే సినిమాతో మరోసారి విజయ్ దేవరకొండకు నిరాశ ఎదురైంది. అవును… తాజాగా స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా, డిజిటల్ వేదికపై కూడా మెప్పించలేకపోయింది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను తాజాగా సన్ […]

దేవరకొండ ఇలా కూడా క్లిక్ అవ్వలేకపోయాడు
X

హీరో విజయ్ దేవరకొండకు ప్రస్తుతం బ్యాడ్ డేస్ నడుస్తున్నట్టున్నాయి. భారీ అంచనాల మధ్య తీసిన డియర్ కామ్రేడ్ ఫెయిలైంది. ఆ తర్వాత చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ అయితే డిజాస్టర్ అయింది. దీంతో పూర్తిగా డైలమాలో పడిపోయాడు దేవరకొండ. కట్ చేస్తే, ఇప్పుడు అదే సినిమాతో మరోసారి విజయ్ దేవరకొండకు నిరాశ ఎదురైంది. అవును… తాజాగా స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా, డిజిటల్ వేదికపై కూడా మెప్పించలేకపోయింది.

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను తాజాగా సన్ నెక్ట్స్ యాప్ లో స్ట్రీమింగ్ కు పెట్టారు. ఇవాళ్టికి అది స్ట్రీమింగ్ కు వచ్చి 4 రోజులు అవుతోంది. అయినప్పటికీ ఆ సినిమాకు ఆశించిన స్థాయిలో హిట్స్ రాలేదు. మరోవైపు చిన్న సినిమాగా వచ్చిన పలాసను ఎక్కువమంది చూస్తున్నారు కానీ విజయ్ దేవరకొండ మూవీని మాత్రం పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు.

సబ్ స్క్రైబర్స్ విషయంలో సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మధ్య చాలా తేడా ఉంది. కేవలం ఈ తేడా వల్లనే సన్ నెక్ట్స్ లో విజయ్ దేవరకొండ సినిమాకు హిట్స్ తక్కువగా వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో పలాసకు హిట్స్ ఎక్కువగా వస్తున్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్ తో భారీగా చందాదారులు వస్తారని ఆశించిన సన్ నెట్ వర్క్ భంగపడింది. ప్రస్తుతం ఈ సంస్థ తన ఆశలన్నీ భీష్మ సినిమాపైనే పెట్టుకుంది. వచ్చే వారం ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది మరి.

First Published:  19 April 2020 1:00 PM IST
Next Story