జగన్ ప్రభుత్వానికి వెంకయ్య అభినందనలు
ఏపీలో కరోనా నియంత్రణలో జగన్ ప్రభుత్వం విఫలమైందని చాటేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాత్రం అందుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. కరోనా పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా లక్ష టెస్ట్ కిట్లను దిగుమతి చేసుకున్న నేపథ్యంలో వెంకయ్యనాయుడు స్పందించారు. పరీక్షలు వేగంగా నిర్వహించేందుకు దక్షిణ కొరియా నుంచి లక్ష రాపిడ్ టెస్ట్ కిట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగుమతి […]
ఏపీలో కరోనా నియంత్రణలో జగన్ ప్రభుత్వం విఫలమైందని చాటేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాత్రం అందుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
కరోనా పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా లక్ష టెస్ట్ కిట్లను దిగుమతి చేసుకున్న నేపథ్యంలో వెంకయ్యనాయుడు స్పందించారు. పరీక్షలు వేగంగా నిర్వహించేందుకు దక్షిణ కొరియా నుంచి లక్ష రాపిడ్ టెస్ట్ కిట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగుమతి చేసుకోవడాన్ని అభినందించారు. . వీటి ద్వారా రోజుకు 10వేల పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండడం మంచి పరిణామమని వ్యాఖ్యానించారు.
ఈ కిట్ల ద్వారా కరోనాను త్వరగా గుర్తించి మరింత పకడ్బందీగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపట్టేందుకు వీలవుతుందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.
అయితే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ ట్వీట్‌ను తెలుగులో చేశారు. దాంతో ఇతర రాష్ట్రాల నెటిజన్లు మీరు ఏం చెప్పారో అర్థం కావడం లేదు… కాబట్టి ఇంగ్లీష్ లో ట్వీట్ చేస్తే అందరికీ అర్ధమవుతుందని విజ్ఞప్తి చేశారు.
వెంకయ్యనాయుడు ఇంగ్లీష్‌లో ట్వీట్ చేసి ఉంటే ఏపీ ప్రభుత్వం కరోనా నియంత్రణకు తీసుకుంటున్న ఆదర్శవంతమైన చర్యలు దేశంలోని అందరికీ తెలిసి ఉండేది.
కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగంగా నిర్వహించేందుకు దక్షిణ కొరియా నుంచి లక్ష సత్వర పరీక్ష (రాపిడ్ టెస్ట్) కిట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగుమతి చేసుకోవడం ముదావహం. వీటి ద్వారా 10 నిమిషాల్లోనే ఫలితాలు రావడం.. రోజుకు 10వేల మందికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండటం మంచి పరిణామం.
— Vice President of India (@VPSecretariat) April 18, 2020
ఈ పరికరాల ద్వారా కరోనా కేసుల్లో ప్రాథమిక పరీక్షలను వీలైనంత త్వరగా గుర్తించడం ద్వారా మరింత పకడ్బందీగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలను చేపట్టేందుకు వీలవుతుంది. #COVID19 #IndiaFightsCorona #Covid19India
— Vice President of India (@VPSecretariat) April 18, 2020