Telugu Global
Cinema & Entertainment

ఆర్ఆర్ఆర్ లో మరో మార్పు...?

ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20కి ‘ఆర్ఆర్ఆర్’లోని ఎన్టీఆర్ కొమురం భీం ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి రాజమౌళి టీం తెగ కష్టపడుతోందట.. అందరూ లాక్ డౌన్ తో ఇంట్లో సేదతీరుతుంటే వీరు మాత్రం ఆర్ఆర్ఆర్ లోని ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం వీడియోలు కట్ చేసే పనిలో బిజీగా ఉన్నారట.. సిబ్బంది అంతా ఇంటి నుంచే పనిచేస్తున్నారట.. ఇక రిలీజ్ డేట్ ను మార్చే పనిలేకుండా డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారట. అయితే జూనియర్ […]

ఆర్ఆర్ఆర్ లో మరో మార్పు...?
X

ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20కి ‘ఆర్ఆర్ఆర్’లోని ఎన్టీఆర్ కొమురం భీం ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి రాజమౌళి టీం తెగ కష్టపడుతోందట.. అందరూ లాక్ డౌన్ తో ఇంట్లో సేదతీరుతుంటే వీరు మాత్రం ఆర్ఆర్ఆర్ లోని ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం వీడియోలు కట్ చేసే పనిలో బిజీగా ఉన్నారట.. సిబ్బంది అంతా ఇంటి నుంచే పనిచేస్తున్నారట.. ఇక రిలీజ్ డేట్ ను మార్చే పనిలేకుండా డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారట.

అయితే జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ పై తీసిన సన్నివేశాల్లో క్వాలిటీ లేకపోవడంతో అతడి హీరోయిన్ ను మార్చడానికి రాజమౌళి ప్రయత్నిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.

ఇప్పటికే ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా లండన్ కు చెందిన ఒలివియా మోరిస్ ను రాజమౌళి ఎంపిక చేశాడు. ఈమె ఒక థియేటర్ ఆర్టిస్ట్. అయినా హీరోయిన్ గా తీసుకున్నాడు. అయితే ఇలాగే లాక్ డౌన్ కొనసాగితే ఆమె భారతదేశానికి రాకపోవచ్చు. షూటింగ్ ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోరును అందించేందుకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి రెడీ అయ్యాడు. బాహుబలిని మించి సంగీతాన్ని అందించేందుకు కీరవాణి కష్టపడుతున్నట్టు సమాచారం.

First Published:  18 April 2020 12:58 AM IST
Next Story