Telugu Global
International

కంపెనీలు చేజారకుండా కేంద్రం సంచలన నిర్ణయం

కరోనా నేపథ్యంలో కేంద్రం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు విధించింది. కరోనా నేపథ్యంలో భారతీయ కంపెనీలు బలహీనపడుతున్న నేపథ్యంలో వాటిని చేజిక్కించుకునేందుకు కొన్ని విదేశీ శక్తులు ప్రయత్నాలు చేస్తుండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కరోనా నేపథ్యంలో ఇటీవల భారత్‌లోని హెచ్‌డీఎఫ్‌సీలో చైనా సెంట్రల్ బ్యాంకు తన వాటాను పెంచుకునేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. చైనాతో సహా భారత్‌ […]

కంపెనీలు చేజారకుండా కేంద్రం సంచలన నిర్ణయం
X

కరోనా నేపథ్యంలో కేంద్రం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు విధించింది. కరోనా నేపథ్యంలో భారతీయ కంపెనీలు బలహీనపడుతున్న నేపథ్యంలో వాటిని చేజిక్కించుకునేందుకు కొన్ని విదేశీ శక్తులు ప్రయత్నాలు చేస్తుండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి.

కరోనా నేపథ్యంలో ఇటీవల భారత్‌లోని హెచ్‌డీఎఫ్‌సీలో చైనా సెంట్రల్ బ్యాంకు తన వాటాను పెంచుకునేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. చైనాతో సహా భారత్‌ సరిహద్దు దేశాలుగా ఉన్న అన్ని దేశాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. భారత్‌ సరిహద్దు దేశాలు భారత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రపంచాన్ని కరోనా పట్టి పీడిస్తుండడంతో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు…. కంపెనీలు భారీగా నష్టాల వైపు పయణిస్తున్నాయి. ఇదే అదనుగా చైనా సదరు విదేశీ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టి వాటిని తన నియంత్రణలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. దాంతో అనేక దేశాలు విదేశీ పెట్టుబడులపై ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. ఇండియా ఇప్పుడు అదే దారిలో పయణించింది.

First Published:  18 April 2020 11:37 AM GMT
Next Story