Telugu Global
Cinema & Entertainment

సినిమా థియేటర్స్ ఓపెన్... అమెరికాలో ఓకే... ఇండియాలో?

కరోనా తెచ్చిన ముప్పు వల్ల ప్రపంచవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ ప్రస్తుతం భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భారత దేశంలో థియేటర్ల పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ఒక వేళ లాక్ డౌన్ ఎత్తివేసినా కరోనా భయానికి జనాలు థియేటర్ కు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇక సామూహికంగా ఎక్కువమంది జమ అయ్యే థియేటర్స్ ను కూడా ఇప్పుడే ప్రభుత్వాలు తెరిపించే యోచనలో అయితే లేవు. కరోనా పూర్తిగా తగ్గాకే థియేటర్స్ తెరిచే అవకాశాలున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం […]

సినిమా థియేటర్స్ ఓపెన్... అమెరికాలో ఓకే... ఇండియాలో?
X

కరోనా తెచ్చిన ముప్పు వల్ల ప్రపంచవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ ప్రస్తుతం భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భారత దేశంలో థియేటర్ల పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ఒక వేళ లాక్ డౌన్ ఎత్తివేసినా కరోనా భయానికి జనాలు థియేటర్ కు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇక సామూహికంగా ఎక్కువమంది జమ అయ్యే థియేటర్స్ ను కూడా ఇప్పుడే ప్రభుత్వాలు తెరిపించే యోచనలో అయితే లేవు. కరోనా పూర్తిగా తగ్గాకే థియేటర్స్ తెరిచే అవకాశాలున్నాయి.

అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉంది. అయితే అమెరికా ప్రభుత్వం మూడు దశల్లో లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయించింది. అందులో మొదటి దశలో థియేటర్లను ప్రారంభించాలని అనుకుంటోందని సమాచారం.

అయితే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారత్ తో పోలిస్తే అమెరికాలోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే అమెరికా ప్రభుత్వం థియేటర్స్ కు అనుమతివ్వడం ద్వారా పూర్తిగా తీవ్రమైన నిర్ణయమే తీసుకుంటోందని చెప్పవచ్చు.

అయితే అమెరికా ప్రభుత్వం నిర్ణయం హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉపశమనం కలిగిస్తోంది. పెద్ద థియేటర్స్ ఉన్న యజమానులు ఈ కష్టకాలంలో ఆర్థికంగా కుదేలయ్యారు. థియేటర్స్ తెరిస్తే మళ్లీ లాభపడుతారు. అయితే మన దేశంలో థియేటర్స్ ను ఎప్పుడు తెరుస్తారన్నది మాత్రం అంత త్వరగా తేలే యవ్వారంలా కనిపించడం లేదు.

First Published:  18 April 2020 6:52 AM GMT
Next Story