Telugu Global
Cinema & Entertainment

రూమర్ కు చెక్ పెట్టిన డైరక్టర్

ఇండస్ట్రీ అన్న తర్వాత పుకార్లు సహజం. కొంతమంది వాటిని లైట్ తీసుకుంటారు. మరికొంతమంది సీరియస్ గా రియాక్ట్ అవుతారు. దర్శకురాలు నందినీరెడ్డి రెండో టైపు. తనపై వచ్చిన ఓ రూమర్ పై ఘాటుగా స్పందించింది నందినీరెడ్డి. ఇంతకీ రూమర్ ఏంటంటే.. త్వరలోనే సమంత లీడ్ రోల్ లో నందినీరెడ్డి దర్శకత్వంలో మరో సినిమా రాబోతోందనేది పుకారు. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబోలో ఓ బేబీ సినిమా వచ్చింది. అది హిట్టయింది కూడా. అందుకే మరోసారి ఈ కాంబినేషన్ పై […]

రూమర్ కు చెక్ పెట్టిన డైరక్టర్
X

ఇండస్ట్రీ అన్న తర్వాత పుకార్లు సహజం. కొంతమంది వాటిని లైట్ తీసుకుంటారు. మరికొంతమంది సీరియస్ గా రియాక్ట్ అవుతారు. దర్శకురాలు నందినీరెడ్డి రెండో టైపు. తనపై వచ్చిన ఓ రూమర్ పై ఘాటుగా స్పందించింది నందినీరెడ్డి.

ఇంతకీ రూమర్ ఏంటంటే.. త్వరలోనే సమంత లీడ్ రోల్ లో నందినీరెడ్డి దర్శకత్వంలో మరో సినిమా రాబోతోందనేది పుకారు. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబోలో ఓ బేబీ సినిమా వచ్చింది. అది హిట్టయింది కూడా. అందుకే మరోసారి ఈ కాంబినేషన్ పై పుకారు చెలరేగింది. దీనిపై క్లారిటీ ఇచ్చింది నందినీరెడ్డి.

ప్రస్తుతానికి సమంతతో తను ఎలాంటి సినిమా చేయడం లేదని స్పష్టంచేసింది ఈ డైరక్టర్. ఒకవేళ సమంతతో ఏదైనా సినిమా చేయాల్సి వస్తే ఆ విషయాన్ని ఇద్దరం గర్వంగా, సంతోషంగా ప్రకటిస్తామని తెలిపింది. మరోవైపు తన అప్ కమింగ్ మూవీపై కూడా నందినీరెడ్డి రియాక్ట్ అయింది.

అందరూ అనుకుంటున్నట్టు తన నెక్ట్స్ మూవీ రీమేక్ కాదని స్పష్టంచేసిన ఈ దర్శకురాలు.. స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఒరిజినల్ స్టోరీతో ఓ సినిమా చేయబోతున్నానని, లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఆ వివరాలు వెల్లడిస్తానని చెబుతోంది.

First Published:  17 April 2020 3:30 PM IST
Next Story