Telugu Global
National

లాక్‌డౌన్ టైంలో మాజీ సీఎం కొడుకు పెళ్లి.... విచారణకు ఆదేశించిన సీఎం యడియూరప్ప..!

కరోనా కారణంగా ఎన్నో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది పెళ్లిళ్లు ఆగిపోయాయి. కరోనా తగ్గిన తర్వాతే శుభకార్యాలు జరుపుదామని అందరూ భావిస్తున్నారు. టాలీవుడ్ హీరోలు నితిన్, నిఖిల్‌లు…. తమ పెళ్ళి వేడుకలను వాయిదా వేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. కరోనా ప్రభావం గురించి తెలిసి.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన కుమార స్వామి మాత్రం లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. తన కొడుకు, సినీ నటుడు నిఖిల్ గౌడ వివాహాన్ని సీనియర్ కాంగ్రెస్ […]

లాక్‌డౌన్ టైంలో మాజీ సీఎం కొడుకు పెళ్లి.... విచారణకు ఆదేశించిన సీఎం యడియూరప్ప..!
X

కరోనా కారణంగా ఎన్నో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది పెళ్లిళ్లు ఆగిపోయాయి. కరోనా తగ్గిన తర్వాతే శుభకార్యాలు జరుపుదామని అందరూ భావిస్తున్నారు. టాలీవుడ్ హీరోలు నితిన్, నిఖిల్‌లు…. తమ పెళ్ళి వేడుకలను వాయిదా వేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

కరోనా ప్రభావం గురించి తెలిసి.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన కుమార స్వామి మాత్రం లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. తన కొడుకు, సినీ నటుడు నిఖిల్ గౌడ వివాహాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణప్ప దూరపు బంధువైన రేవతికి ఇచ్చి చేశారు. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు బెంగళూరుకు సమీపంలోని తమ ఫామ్‌హౌస్‌లో ఈ వివాహం జరిగింది. వివాహం జరిపించారు సరే.. ఏ నలుగురైదుగురు కుటుంబ సభ్యులతో మమ అనిపించారా అంటే అదీ లేదు. ఈ పెండ్లికి కాంగ్రెస్, జేడీయూకు చెందిన 100 మంది నాయకులు, బంధువులు భారీగా హాజరయ్యారు. పెళ్లి సమయంలో ఎవరూ సామాజిక దూరాన్ని కూడా పాటించలేదు.

పెండ్లి కొడుకు నిఖిల్ గౌడ శాండల్ వుడ్ హీరో, తండ్రి కుమార స్వామి మాజీ సీఎం, తాతయ్య దేవెగౌడ మాజీ ప్రధాని.. వీళ్లు లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఏకంగా వివాహ వేడుకలు చేయడంపై కర్ణాటక సీఎం యడియూరప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాహం జరిగిన రామ్‌నగర్ పరిధి డిప్యుటీ కమిషనర్‌కు ఈ పెళ్లిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

లాక్‌డౌన్ సమయంలో జరిగిన ఈ వివాహంపై చర్యలు తీసుకోకుంటే వ్యవస్థలను వెక్కిరించినట్లు అవుతుందని ఉపముఖ్యమంత్రి అశ్వథ్ నారాయణ అన్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీతో మాట్లాడానని.. వివాహం జరిపించిన వారిపై, హాజరైన వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

First Published:  17 April 2020 10:12 AM IST
Next Story