Telugu Global
Cinema & Entertainment

తన రిటైర్ మెంట్ పై స్పందించిన కొరటాల శివ

కొరటాల శివ. తమిళంలో అగ్ర దర్శకుడు శంకర్ లాగే తెలుగులో సామాజిక ఇతివృత్తంతో కథలు రాసుకొని సినిమా తీసి హిట్స్ కొట్టి అనతికాలంలోనే టాలీవుడ్ లో బడా దర్శకుడిగా ఎదిగాడు. వరుస విజయాలతో టాలీవుడ్ లో టాప్ దర్శకుడయ్యాడు. విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కొరటాల ఈ కరోనా లాక్ డౌన్ వేళ సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించాడు. చిరంజీవితో ప్రస్తుతం తీస్తున్న ‘ఆచార్య’ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆచార్య […]

తన రిటైర్ మెంట్ పై స్పందించిన కొరటాల శివ
X

కొరటాల శివ. తమిళంలో అగ్ర దర్శకుడు శంకర్ లాగే తెలుగులో సామాజిక ఇతివృత్తంతో కథలు రాసుకొని సినిమా తీసి హిట్స్ కొట్టి అనతికాలంలోనే టాలీవుడ్ లో బడా దర్శకుడిగా ఎదిగాడు. వరుస విజయాలతో టాలీవుడ్ లో టాప్ దర్శకుడయ్యాడు. విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కొరటాల ఈ కరోనా లాక్ డౌన్ వేళ సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించాడు.

చిరంజీవితో ప్రస్తుతం తీస్తున్న ‘ఆచార్య’ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆచార్య సినిమా షూటింగ్ 40శాతం పూర్తి అయ్యిందని.. లాక్ డౌన్ తర్వాత రాంచరణ్ పాత్ర చిత్రీకరణ జరుగుతుందని తెలిపారు.

ఇక కొరటాల తన రిటైర్ మెంట్ గురించి వివరించి తెలుగు ప్రేక్షకులకు షాకిచ్చారు. మరో 5 ఏళ్ల తర్వాత తాను దర్శకత్వం నుంచి వీడ్కోలు పలుకుతానని సంచలన విషయం వెల్లడించారు. తాను చేయాలనుకున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత సినీ పరిశ్రమ నుంచి రిటైర్ అవుతానని అన్నారు. దర్శకులపై ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని.. కాబట్టి చిత్ర పరిశ్రమలో ఎల్లకాలం పనిచేయడం అంత తేలికైన విషయం కాదని కొరటాల శివ అన్నారు.

First Published:  17 April 2020 8:34 AM IST
Next Story