మెగా హీరోకు చేదు అనుభవం... క్లారిటీ ఇచ్చాడు...
లాక్ డౌన్ వేళ అందరూ ఇంట్లో ఉంటూ ఖాళీ టైంలో తమకిష్టమైన వ్యాపకాలు చేస్తున్నారు. చాలా మంది సినిమాలు చూస్తూ… ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతున్నారు. ఇక కొందరు స్టార్ హీరోలు అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ నిర్వహిస్తున్నారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ అభిమానులతో చిట్ చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా తనకు జరిగిన ప్రమాదంపై అభిమానులతో పంచుకున్నారు. అదే తన జీవితంలో చేదు అనుభవం అని చెప్పుకొచ్చాడు.. ఓ సారి రాంచరణ్ తో […]
లాక్ డౌన్ వేళ అందరూ ఇంట్లో ఉంటూ ఖాళీ టైంలో తమకిష్టమైన వ్యాపకాలు చేస్తున్నారు. చాలా మంది సినిమాలు చూస్తూ… ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతున్నారు. ఇక కొందరు స్టార్ హీరోలు అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ నిర్వహిస్తున్నారు.
తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ అభిమానులతో చిట్ చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా తనకు జరిగిన ప్రమాదంపై అభిమానులతో పంచుకున్నారు. అదే తన జీవితంలో చేదు అనుభవం అని చెప్పుకొచ్చాడు..
ఓ సారి రాంచరణ్ తో కలిసి తాను గుర్రపు స్వారీ చేశానని.. ఆ టైమ్ లో గుర్రంపై నుంచి కిందపడ్డానని వరుణ్ తేజ్ గుర్తు చేసుకున్నాడు. గాయాలు కావడంతో ఇక అప్పటి నుంచి తాను గుర్రం ఎక్కలేదని వరుణ్ తెలిపాడు. గుర్రమంటే భయం కలుగుతోందన్నారు.
తమ మెగా హీరోల్లో అందరికీ గుర్రపు స్వారీ వచ్చునని.. తనకు మాత్రం రాదని.. ఏదైనా సినిమాలో పాత్ర వస్తే పరిస్థితి చెప్పలేమని వరుణ్ అభిమానులతో తనకు జరిగిన ప్రమాదంపై గుర్తు చేసుకున్నాడు.