Telugu Global
NEWS

రాయపాటి... వంగవీటి ఎపిసోడ్ మరిచావా?, పరిటాల హత్య గుర్తు లేదా?- నెటిజన్ల ఫైర్

రాయపాటి సాంబశివరావు. సుధీర్ఘకాలం ఎంపీగా పనిచేశాడు. బ్యాంకులకు వేల కోట్లు కుచ్చుటోపి పెట్టాడు. చైనాకు పొగాకు బదులు బండరాళ్లు ఎగుమతి చేసి అక్కడ కొందరు అధికారులు ఉరి కంబానికి వేలాడేలా చేసిన ఘనుడు. ఆ మధ్య తారా చౌదరి ఉదంతంలోనూ రాయపాటి రాసలీలలపై చర్చజరిగింది. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. తమ కులపోళ్లతో పెట్టుకుంటే జగన్‌ లేచిపోతాడు అంటూ వార్నింగులు ఇస్తున్నాడు. కమ్మవారిని జగన్ టార్గెట్ చేశారని… కమ్మవారిని పక్కన పెడుతున్నారని… కమ్మవారు ఏం చేస్తారు లే […]

రాయపాటి... వంగవీటి ఎపిసోడ్ మరిచావా?, పరిటాల హత్య గుర్తు లేదా?- నెటిజన్ల ఫైర్
X

రాయపాటి సాంబశివరావు. సుధీర్ఘకాలం ఎంపీగా పనిచేశాడు. బ్యాంకులకు వేల కోట్లు కుచ్చుటోపి పెట్టాడు. చైనాకు పొగాకు బదులు బండరాళ్లు ఎగుమతి చేసి అక్కడ కొందరు అధికారులు ఉరి కంబానికి వేలాడేలా చేసిన ఘనుడు. ఆ మధ్య తారా చౌదరి ఉదంతంలోనూ రాయపాటి రాసలీలలపై చర్చజరిగింది. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. తమ కులపోళ్లతో పెట్టుకుంటే జగన్‌ లేచిపోతాడు అంటూ వార్నింగులు ఇస్తున్నాడు.

కమ్మవారిని జగన్ టార్గెట్ చేశారని… కమ్మవారిని పక్కన పెడుతున్నారని… కమ్మవారు ఏం చేస్తారు లే అనుకోవద్దు… కమ్మవారు తలుచుకుంటే జగన్ లేచిపోతాడు అంటూ హెచ్చరించాడు రాయపాటి. ఈ వయసులో శాంతివచనాలు చెప్పాల్సిన రాయపాటి ఇలా బోయపాటి శీను సినిమా డైలాగులు చెబుతుండడంతో చూసి నెటిజన్లు పలు రకాలుగా మాట్లాడుతున్నారు.

మీలాంటి వారి వల్లే కదా ఈ రోజు కమ్మకులం మిగిలిన వర్గాలకు దూరమైంది అని కొందరు విమర్శిస్తున్నారు. ఈ పౌరుషం ఏదో బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టకుండా తిరిగి చెల్లించే విషయంలో చూపాల్సింది అని మరికొందరు ఎత్తిపొడుస్తున్నారు. జగన్‌ను లేపడం అంటే తారా చౌదరి ఎపిసోడ్‌ అంత ఈజీ అనుకుంటున్నారా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి… ఇలా ఓవరాక్షన్ చేసే అనంతపురం జిల్లాలో పరిటాల రవి సొంత పార్టీ కార్యాలయంలోనే కళ్లలోకి బుల్లెట్లు దింపించుకుని పైకి పోయాడు అని గుర్తు చేస్తున్నారు.

రాయపాటి లాంటి మూర్ఖులు ముందూ వెనుక ఆలోచించకుండా వంగవీటి రంగాను హత్య చేయడంతో విజయవాడలో కమ్మవారు ఎంత ఇబ్బందిపడ్డారో మరిచిపోయారా? అని మరికొందరు విమర్శిస్తున్నారు. కొందరు టీడీపీ నేతలు రంగాను హత్య చేస్తే…. విజయవాడలోని కమ్మవారు బతికితే చాలు దేవుడా అంటూ ఆస్తులు, ఇళ్లు వదిలేసి వెళ్లిన ఉదంతాలు మరిచిపోయారా? అని రాయపాటిపై ఫైర్ అవుతున్నారు.

నీకు ఎంత కండకావరం కాకుంటే ఏకంగా కమ్మవారు తలుచుకుంటే ముఖ్యమంత్రి జగనే లేచిపోతాడని వ్యాఖ్యానిస్తావు అని మరికొందరు రాయపాటిని దులిపేస్తున్నారు.

First Published:  16 April 2020 4:33 AM IST
Next Story