Telugu Global
National

మరో వారంలో రోజుకు 17వేల కరోనా పరీక్షలు " జవహర్ రెడ్డి

కరోనా పరీక్షల సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెంచుకోగలుగుతున్నామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్ రెడ్డి వివరించారు. బుధవారం నాటికి ఏపీలో 16వేల 555 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. గడిచిన పదిరోజుల్లోనే 12వేల 625 మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. ప్రస్తుతం ఏపీలో ఏడు ల్యాబ్‌లు మూడు షిప్ట్‌ల్లో పనిచేస్తున్నాయని… మరో రెండు ల్యాబులు సిద్ధంగా ఉన్నాయని… ఒకటి రెండు రోజుల్లో ఆ రెండు ల్యాబుల్లో కూడా పరీక్షలు ప్రారంభిస్తామని చెప్పారు. కరోనా […]

మరో వారంలో రోజుకు 17వేల కరోనా పరీక్షలు  జవహర్ రెడ్డి
X

కరోనా పరీక్షల సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెంచుకోగలుగుతున్నామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్ రెడ్డి వివరించారు. బుధవారం నాటికి ఏపీలో 16వేల 555 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. గడిచిన పదిరోజుల్లోనే 12వేల 625 మందికి పరీక్షలు నిర్వహించామన్నారు.

ప్రస్తుతం ఏపీలో ఏడు ల్యాబ్‌లు మూడు షిప్ట్‌ల్లో పనిచేస్తున్నాయని… మరో రెండు ల్యాబులు సిద్ధంగా ఉన్నాయని… ఒకటి రెండు రోజుల్లో ఆ రెండు ల్యాబుల్లో కూడా పరీక్షలు ప్రారంభిస్తామని చెప్పారు. కరోనా నివారణకు ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని వివరించారు.

దేశ వ్యాప్తంగా బుధవారం వరకు 2,74,599 పరీక్షలు చేశారన్నారు. దేశంలో ప్రతి 10లక్షలకు 198 పరీక్షలు చేశారని వివరించారు. రాజస్థాన్‌లో ఇప్పటి వరకు 37వేల 880 పరీక్షలు చేశారన్నారు. అక్కడ ప్రతి 10 లక్షల మందికి సగటున 549 మందికి, కేరళలో ప్రతి పది లక్షల మందికి సగటున 485గా ఉందని చెప్పారు. కేరళలో ఇప్పటి వరకు మొత్తం 16వేల 475 పరీక్షలు చేశారన్నారు.

మహారాష్ట్రలో 50,882 పరీక్షలు చేశారన్నారు. ప్రతి పది లక్షల మందికి సగటున 446 మందికి పరీక్షలు చేశారని వివరించారు. ఏపీలో ఇప్పటి వరకు 16వేల 555 పరీక్షలు చేశామని… ప్రతి పది లక్షల మందికి సగటున 331 మందికి పరీక్షలు చేశామని జవహర్ రెడ్డి వివరించారు. పరీక్షల నిర్వాహణలో ఏపీ ప్రభుత్వం ముందువరుసలోనే ఉందని వెల్లడించారు.

మూడు రోజుల నుంచి రోజుకు రెండు వేల పరీక్షలు చేస్తున్నట్టు చెప్పారు. నేడు మూడు వేల పరీక్షలు చేశామన్నారు. ట్రూనాట్ కిట్స్‌ కొత్తగా 18వేలు వచ్చాయన్నారు. 225 ట్రూనాట్‌ మిషన్లు ఉన్నట్టు వివరించారు. లక్ష కిట్లకు ఆర్డర్ పెట్టినట్టు చెప్పారు.

మరోవారంలో రోజుకు 17వేల పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యం తాము పెట్టుకున్నట్టు జవహర్ రెడ్డి వివరించారు. 225 ట్రూనాట్ మిషన్లను 13 జిల్లాల్లోని 49 సెంటర్లలో ఏర్పాటు చేసి అక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్న మొత్తం 32 వేలమందికి వారంలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని జవహర్ రెడ్డి చెప్పారు.

కరోనాతో వైద్యం తీసుకున్న వారికి రెండు సార్లు నెగిటివ్ వస్తేనే డిశ్చార్జ్ చేస్తున్నట్టు జవహర్ రెడ్డి చెప్పారు. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 14 రోజుల పాటు బయట తిరిగేందుకు అనుమతి ఉండదన్నారు.

First Published:  16 April 2020 2:40 PM IST
Next Story