Telugu Global
Cinema & Entertainment

నా బయోపిక్ వచ్చే ఛాన్స్ లేదు

తన సినిమాకు సంబంధించి చిరంజీవి మరోసారి క్లారిటీ ఇచ్చాడు. తన జీవితం బయోపిక్ గా వచ్చే అవకాశం లేదని స్పష్టంచేశారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు మెగాస్టార్. ఇదే విషయాన్ని కొన్ని రోజుల కిందట నాగబాబు కూడా స్పష్టంచేశారు. ఇంతకీ ఈ మేటర్ మరోసారి వార్తల్లోకి రావడానికి కారణం తెలుసా? లాక్ డౌన్ టైమ్ లో హీరోలంతా తమకు నచ్చిన పనులతో బిజీ అయిపోయారు. చిరంజీవి కూడా అలాంటిదే ఓ […]

నా బయోపిక్ వచ్చే ఛాన్స్ లేదు
X

తన సినిమాకు సంబంధించి చిరంజీవి మరోసారి క్లారిటీ ఇచ్చాడు. తన జీవితం బయోపిక్ గా వచ్చే అవకాశం లేదని స్పష్టంచేశారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు మెగాస్టార్. ఇదే విషయాన్ని కొన్ని రోజుల కిందట నాగబాబు కూడా స్పష్టంచేశారు. ఇంతకీ ఈ మేటర్ మరోసారి వార్తల్లోకి రావడానికి కారణం తెలుసా?

లాక్ డౌన్ టైమ్ లో హీరోలంతా తమకు నచ్చిన పనులతో బిజీ అయిపోయారు. చిరంజీవి కూడా అలాంటిదే ఓ పని ప్రారంభించారు. తన జీవితానికి సంబంధించిన కీలక ఘట్టాలన్నీంటినీ ఆడియో రూపంలో భద్రపరుస్తున్నట్టు వెల్లడించారు. భార్య సురేఖతో కలిసి ఈ పని చేస్తున్నట్టు స్వయంగా ప్రకటించారు. దీంతో చిరంజీవి జీవితంపై బయోపిక్ వస్తుందంటూ పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లకు తాజాగా చెక్ పెట్టారు చిరు.

బయోపిక్ తీయాలంటే జీవితంలో ఎమోషన్స్, టర్నింగ్ పాయింట్స్ ఉండాలని.. తన జీవితంలో కానీ, కెరీర్ లో కానీ అలాంటి ఎమోషన్స్ లేవని చెప్పుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే తన కెరీర్ చాలా సాఫీగా సాగిపోయిందని, జీవితం కూడా అంతే సాఫీగా సాగిపోయిందని.. బయోపిక్ కు కావాల్సినంత స్ట్రగుల్ తన లైఫ్ లో లేదని స్పష్టంచేశారు.

అయితే తన జీవితం-కెరీర్ పుస్తకంగా వచ్చే అవకాశం ఉందని, కుదిరితే డాక్యుమెంటరీగా కూడా వస్తుందని స్పష్టంచేశారు చిరంజీవి.

First Published:  16 April 2020 3:27 AM IST
Next Story