Telugu Global
National

లాక్‌డౌన్‌ కొత్త మార్గదర్శకాలు ఇవే... వ్యవసాయానికి ఊరట

లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిర్వాహణకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు ఏప్రిల్‌ 20 నుంచి అమలులోకి వస్తాయి. దేశవ్యాప్తంగా వ్యవసాయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కొనసాగింపుకు కేంద్రం వీలు కల్పించింది. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, క్రయవిక్రయాలకు మండీలను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ప్రజలు బయటకు వచ్చేటప్పుడు మాస్కులు తప్పనిసరి చేయాలని ఆదేశించింది. హాట్ స్పాట్‌లపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వం […]

లాక్‌డౌన్‌ కొత్త మార్గదర్శకాలు ఇవే... వ్యవసాయానికి ఊరట
X

లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిర్వాహణకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు ఏప్రిల్‌ 20 నుంచి అమలులోకి వస్తాయి. దేశవ్యాప్తంగా వ్యవసాయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కొనసాగింపుకు కేంద్రం వీలు కల్పించింది.

వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, క్రయవిక్రయాలకు మండీలను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ప్రజలు బయటకు వచ్చేటప్పుడు మాస్కులు తప్పనిసరి చేయాలని ఆదేశించింది.

హాట్ స్పాట్‌లపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. హాట్‌ స్పాట్‌లలో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించింది. హాట్‌ స్పాట్‌లలో లాక్‌ డౌన్‌కు ఎలాంటి మినహాయింపులు ఉండవు. హాట్‌ స్పాట్‌లలో నిత్యావసరాల పంపిణీకి మాత్రమే అనుమతులు ఇచ్చింది. హాట్ స్పాట్లను ఎంపిక చేసే వీలు రాష్ట్ర ప్రభుత్వాలకే కల్పించింది.

గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల నిర్వాహణకు అనుమతి ఇచ్చింది. నిర్మాణ రంగంలో పరిమితంగా పనులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. నిర్మాణ రంగంలో స్థానిక కార్మికులను మాత్రమే వాడుకోవాలని స్పష్టం చేసింది.

కాఫీ, తేయాకు పరిశ్రమలలో 50 శాతం మ్యాన్‌ పవర్‌తో పనులు చేసుకునేందుకు వీలు కల్పించింది. పట్టణ పరిధిలో లేని అన్ని రకాల ఫుడ్ ప్రాసెసింగ్‌ యూనిట్లకు అనుమతి ఇచ్చింది. మే 3 వరకు అన్ని విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసుల రద్దు కొనసాగుతుంది. ఏప్రిల్‌ 20 నుంచి అమలులోకి వచ్చే ఈ కొత్త మార్గదర్శకాలు మే 3 వరకు వర్తిస్తాయి.

ఆన్‌లైన్ షాపింగ్, ఈ- కామర్స్‌కు అనుమతి ఇచ్చింది. మే 3 వరకు రాష్ట్రాల మధ్య రాకపోకలపై నిషేధం కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా విధులకు హాజరయ్యే సమయంలో ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ రవాణాపై ఆధారపడకుండా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రయాణికులు కిక్కిరిసి ఉండకుండా వాహనాల సామర్థ్యంలో 30 నుంచి 40 శాతం వరకు మాత్రమే ప్రయాణికులను అనుమతించాలని కోరింది.

కార్మికులు విధులు నిర్వహించే సామాగ్రిని ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలని కేంద్రం సూచించింది. విధులకు హాజరయ్యే వారికి మెడికల్ ఇన్స్యూరెన్స్ తప్పనిసరి చేసింది కేంద్రం. అనుమతించిన పరిశ్రమల వద్ద ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లలో శానిటైజేషన్‌ ఏర్పాట్లను తప్పనిసరి చేసింది. సోషల్ డిస్టెన్స్‌ అమలుకు వీలుగా ఉద్యోగులు షిప్ట్‌లు మారే సమయంలో గంట విరామం పాటించాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. కార్యాలయాల్లో ఒక్కో ఉద్యోగికి మధ్య కనీసం ఆరు అడుగుల దూరాన్ని పాటించాలని సూచించింది.

సామూహిక మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. లిక్కర్, గుట్కా, పొగాకు అమ్మకాలపై నిషేధం కొనసాగుతుంది.

సభలు, సమావేశాలపై నిషేధం కొనసాగుతుంది. విద్యాసంస్థలన్నింటిని మూసి ఉంచాలని ఆదేశించింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాలు తెరిచేందుకు అమనుతి ఇచ్చింది. ఏప్రిల్ 20 నుంచి జాతీయ ఉపాధి హామీ పనులకు అనుమతి ఇచ్చింది. బ్యాంకుల కార్యకలాపాలు యాథాతథంగా కొనసాగుతాయి. సినిమా థియేటర్లు, జిమ్‌లు, రెస్టారెంట్లు, మాల్స్‌, బార్లు మూసివేత కొనసాగుతుంది. ఆన్‌లైన్ ద్వారా నిత్యావసరాల సరఫరాకు మాత్రమే అనుమతి ఇచ్చారు. మే 3 వరకు రాష్ట్రాల మధ్య రాకపోకలపై నిషేధం కొనసాగుతుంది.

First Published:  15 April 2020 5:59 AM IST
Next Story