అడిగి మరీ మోడీతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు
ఎట్టకేలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి ప్రధాని నరేంద్రమోడీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే ఇది చంద్రబాబు మీద ప్రేమతో, అభిమానంతో నరేంద్రమోడీ నేరుగా చేసిన ఫోన్ కాల్ కాదు. చంద్రబాబే అడిగి మరీ మోడీతో మాట్లాడారు. రాత్రి పీఎంవో కార్యాలయానికి ఫోన్ చేసిన చంద్రబాబునాయుడు… తాను ప్రధానితో రెండు నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నట్టు పీఎంవో అధికారులకు వివరించాడు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే మీడియా సమావేశంలో చెప్పాడు. దాంతో ఉదయం ఎనిమిదిన్నరకు మోడీ ఫోన్ చేసి తనతో […]
ఎట్టకేలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి ప్రధాని నరేంద్రమోడీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే ఇది చంద్రబాబు మీద ప్రేమతో, అభిమానంతో నరేంద్రమోడీ నేరుగా చేసిన ఫోన్ కాల్ కాదు. చంద్రబాబే అడిగి మరీ మోడీతో మాట్లాడారు.
రాత్రి పీఎంవో కార్యాలయానికి ఫోన్ చేసిన చంద్రబాబునాయుడు… తాను ప్రధానితో రెండు నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నట్టు పీఎంవో అధికారులకు వివరించాడు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే మీడియా సమావేశంలో చెప్పాడు. దాంతో ఉదయం ఎనిమిదిన్నరకు మోడీ ఫోన్ చేసి తనతో మాట్లాడారని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశాడు. కరోనాపై తాను అధ్యయనం చేసిన అంశాలను మోడీకి వివరించినట్టు చంద్రబాబు చెప్పాడు.
ఇలా ముందస్తుగా అడిగి మరీ మోడీతో చంద్రబాబు మాట్లాడడం చర్చనీయాంశమైంది. కొద్ది రోజుల క్రితమే ప్రధాని మోడీ కరోనా అంశంపై దేశంలోని కీలక నేతలందరికీ ఫోన్ చేసి మాట్లాడారు. వారిలో స్టాలిన్, అఖిలేష్ యాదవ్ లాంటి జూనియర్లతో పాటు దేవేగౌడ, ములాయం సింగ్ యాదవ్ లాంటి వారు కూడా ఉన్నారు. ఒక్క చంద్రబాబుకు మాత్రం ఫోన్ రాలేదు. అప్పటి నుంచి టీడీపీ క్యాంపులో అలజడి ఉంది.
మోడీకి చంద్రబాబుపై ఇంకా కోపం తగ్గలేదన్న అభిప్రాయం ఏర్పడింది. దాంతో ఇప్పుడు చంద్రబాబే పీఎంవోకు ఫోన్ చేసి రెండు నిమిషాలు ప్రధానితో మాట్లాడుతాను అని విజ్ఞప్తి చేయడం ఆసక్తిగా ఉంది.
అయితే చంద్రబాబుకు ప్రధాని ఫోన్ చేసిన అంశాన్ని పీఎంవో ఇప్పటి వరకు ఎక్కడా వెల్లడించలేదు.