మే 3 వరకు లాక్‌డౌన్ అందుకేనా..?
కరోనాను సాధ్యమైనంత మేర కట్టడి చేయాలంటే లాక్‌డౌన్‌ను మించిన పరిష్కారం మరేదీ లేదని ప్రపంచ దేశాలన్నీ నమ్ముతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి వేగాన్ని తగ్గించడం.. తద్వారా రోగాల బారిన పడిన వారిని చికిత్స చేసి ఇండ్లకు పంపించేయడం కేవలం లాక్‌డౌన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రధాని మోడీ మే 3 వరకు లాక్‌డౌన్ ప్రకటించక ముందే పంజాబ్, ఒడిషా, తెలంగాణ రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించాయి. వ్యవసాయ పనులకు, ఉపాధి హామీ పనులకు కాస్త […]
కరోనాను సాధ్యమైనంత మేర కట్టడి చేయాలంటే లాక్‌డౌన్‌ను మించిన పరిష్కారం మరేదీ లేదని ప్రపంచ దేశాలన్నీ నమ్ముతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి వేగాన్ని తగ్గించడం.. తద్వారా రోగాల బారిన పడిన వారిని చికిత్స చేసి ఇండ్లకు పంపించేయడం కేవలం లాక్‌డౌన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
ప్రధాని మోడీ మే 3 వరకు లాక్‌డౌన్ ప్రకటించక ముందే పంజాబ్, ఒడిషా, తెలంగాణ రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించాయి. వ్యవసాయ పనులకు, ఉపాధి హామీ పనులకు కాస్త సడలింపులు కూడా ఇచ్చాయి. ఇక ప్రధాని కూడా ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తారని అనుకుంటే.. ఇవాళ ఉదయం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మే 3 వరకు అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
కాగా, మోడీ లాక్‌డౌన్ 3 వరకు పొడిగించడానికి విశ్లేషకులు కారణాలు చెబుతున్నారు. ఏప్రిల్ 30 తేదీన లాక్‌డౌన్ ముగిసినా.. మే 1 పబ్లిక్ హాలీడే కాబట్టి కార్యాలయాలు ఉండవు. ఆ తర్వాత 2 వ తేదీ శనివారం, 3వ తేదీ ఆదివారం. దీంతో లాక్‌డౌన్ 30న ఎత్తేస్తే.. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయని జనాలు బయటకు వచ్చేస్తారని.. అవసరమైతే లాంగ్ డ్రైవ్‌లు, గుడులు, గోపురాలు అంటూ సందర్శనలకు వెళ్తారని భావించారు. అదే జరిగితే కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉంటుందని భావించే మే 3 వరకు లాక్‌డౌన్ విధించారని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు ఏప్రిల్ 20 తర్వాత సడలింపులు ఇస్తామని చెప్పినా.. అవి కేవలం రెడ్ జోన్లో ఉండే వారికి మాత్రమే వర్తించనున్నాయి. ప్రస్తుతం రెడ్‌జోన్లో ఉండే వాళ్లు ఇండ్లు కూడా దాటి బయటకు వచ్చే వీలు లేదు. ఏప్రిల్ 20 కల్లా వారికి క్వారంటైన్ పిరియడ్ అయిపోతుంది. కనుక వారికి సడలింపులు ఉంటాయి తప్ప లాక్‌డౌన్ నిబంధనల్లో మార్పులు దాదాపు చేయరని చెబుతున్నారు. కాబట్టి ప్రజలందరూ మే 3 వరకు ఇదే స్పూర్తితో లాక్‌డౌన్ పాటించి కరోనాను కట్టడి చేయడానికి సహకరించాలని కోరుతున్నారు.