Telugu Global
National

కరోనా టైమ్‌లో రాజకీయమేనా? ప్రతిపక్షం తీరు ఇదేనా?

కరోనా… కరోనా… ఇప్పుడు ఇదే మాట విన్పిస్తోంది. ప్రపంచ దేశాలు ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలి అని అన్వేషన చేస్తున్నాయి. వివిధ దేశాలు తమకు తోచిన ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికా ఆపదలో ఉంది. అక్కడ మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. న్యూయార్క్‌లో హెల్త్‌ ఎమర్జెన్సీ నడుస్తోంది. ఇటలీ, స్పెయిన్‌, బ్రిటన్‌ దేశాలు కూడా కరోనాను ఎదుర్కొనే పనిలో ఉన్నాయి. కొన్ని దేశాలు చేతులెత్తేశాయి కూడా. మనదేశంలో అన్ని రాష్ట్రాలు ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు […]

కరోనా టైమ్‌లో రాజకీయమేనా? ప్రతిపక్షం తీరు ఇదేనా?
X

కరోనా… కరోనా… ఇప్పుడు ఇదే మాట విన్పిస్తోంది. ప్రపంచ దేశాలు ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలి అని అన్వేషన చేస్తున్నాయి. వివిధ దేశాలు తమకు తోచిన ప్రయత్నాలు చేస్తున్నాయి.

అమెరికా ఆపదలో ఉంది. అక్కడ మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. న్యూయార్క్‌లో హెల్త్‌ ఎమర్జెన్సీ నడుస్తోంది. ఇటలీ, స్పెయిన్‌, బ్రిటన్‌ దేశాలు కూడా కరోనాను ఎదుర్కొనే పనిలో ఉన్నాయి. కొన్ని దేశాలు చేతులెత్తేశాయి కూడా.

మనదేశంలో అన్ని రాష్ట్రాలు ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు చేపట్టాయి. లాక్‌డౌన్‌ పొడిగించాలని కొన్ని రాష్ట్రాలు నిర్ణయించాయి. మరికొన్ని రాష్ట్రాలు వ్యవసాయ పనులకు అటంకం లేకుండా చర్యలు చేపడుతున్నాయి.

కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రం దుష్ట రాజకీయం నడుస్తోంది. ఒక వైపు ప్రభుత్వం కరోనా నివారణకు చర్యలు చేపడుతోంది. మర్కజ్‌ లింక్‌లను పూర్తిస్థాయిలో మొదట కనిపెట్టింది ఏపీ అధికారులే. ఇతర రాష్ట్రాల అధికారులను అప్రమత్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన అందరినీ క్వారంటైన్‌కు పంపించారు. ప్రభుత్వం తరపున ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం ఆధ్వర్యంలో అధికారులతో ప్రతి రోజూ సమీక్షలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ ను సక్సెస్ ఫుల్ గా అమలు చేసి, కరోనా కేసులను కట్టడి చేసి…. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచింది కూడా.

కానీ ఏరాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మాత్రం ప్రతిపక్షం సహకరించడం లేదు. తమ వంతు ఏమైనా సాయం చేస్తున్నారా? అంటే అదేమీ లేదు. ప్రతిపక్ష నేత హైదరాబాద్‌కు పరిమితమయ్యాడు. అక్కడి నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశాలు అంటూ మీడియాలో హడావుడి చేస్తున్నాడు.

ఇటు బెజవాడలో ఆ పార్టీ నేతలు కరోనాతో ఉపాధి కోల్పోయిన వారికి ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. 12 గంటల దీక్షను విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రాంమ్మోహన్‌ రావు దంపతులు చేపట్టారు. వీరికి టీడీపీ ఎంపీ కేశినేని నాని, బుద్దా వెంకన్న మద్దతు పలికారు.

ఆర్ధికంగా అంతో ఇంతో బలంగా ఉన్న తెలంగాణనే కరోనా దెబ్బతో భారీగా ఆదాయం కోల్పోతుంది. ఇప్పటివరకూ 500 కోట్ల ఆదాయం రాలేదు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలి? వచ్చే నెల ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వాలి? అని ఇప్పటినుంచే తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది.

అయితే ఆర్ధికంగా లోటు ఉన్నా… నిధులు రాకున్నా… ఏపీ ప్రభుత్వం జీతాలు ఆపలేదు. జీతం మొత్తం వాయిదా వేయలేదు. రెండు విడతల్లో చెల్లిస్తోంది. ఇక ఉపాధి కోల్పోయిన వారికి ఫ్రీ రేషన్‌తో పాటు కిలో కందిపప్పు అందిస్తోంది. అలాగే వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది.

అదేవిధంగా తెలంగాణలో మాత్రమే 15 వందలు, ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. ఏ ఇతర రాష్ట్రంలో కూడా వెయ్యి రూపాయలు కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. ఇక తెలుగుదేశం మాత్రం ఐదు వేలు ఇవ్వాలనే డిమాండ్‌లో ఏమైనా పస ఉందా? ప్రతిపక్షం బాధ్యత మరిచి ప్రవర్తించే ఈ నేతలను ఏమనాలి? కరోనా బాధితులు ఉంటే వచ్చి పరీక్ష చేయించుకోవాలని పిలుపు ఇవ్వాలి. లేకపోతే తమకు చేతనైనంత సాయం చేయాలి? అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో దేశంలో ఏ రాజకీయపార్టీ గానీ, నేతగాని ఇలాంటి రాజకీయం చేయడం లేదు. ఒక్క తెలుగుదేశం. ఆ పార్టీ నేతలు తప్ప.

చాలా మంది తెలుగుదేశం నేతలకే చంద్రబాబు వైఖరి నచ్చడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ ఇంట్లో కూర్చున్నాడు. ప్రపంచం మొత్తం ఆపదలో ఉంది. అలాగే మన రాష్ట్రం కష్టంలో ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి వీలైనంత మద్దతు, సలహాలు ఇవ్వాలి కానీ ఇదేమి రాజకీయం అంటూ ఆ పార్టీ కిందిస్థాయి నేతలే మండిపడుతున్నారు. మీరు ఇక మారరు…. అంటూ అధికార పార్టీనేతలు కామెంట్ చేస్తున్నారు.

First Published:  13 April 2020 1:44 PM IST
Next Story