బాబీ దర్శకత్వంలో చిరంజీవి !
మెగాస్టార్ చిరంజీవితో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దర్శకుడు సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. సర్ధార్ గబ్బర్ సింగ్ దర్శకుడు బాబి అలియాస్ కేఎస్ రవీంద్ర తాజాగా మెగాస్టార్ కు ఒక మంచి కథను వినిపించినట్టు తెలిసింది. ఆ కథను విన్న చిరంజీవి వెంటనే బాగుందని ఓకే చెప్పాడట.. స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసి.. బౌండెడ్ స్క్రిప్ట్ తో రావాలని చిరంజీవి సూచించాడట. నిజానికి రాంచరణ్ కొన్న మలయాళ మూవీ ‘లూసిఫర్’ రిమేక్ దర్శకుడిగా చేయించాలని మొదట అనుకున్నారట.. […]

మెగాస్టార్ చిరంజీవితో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దర్శకుడు సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. సర్ధార్ గబ్బర్ సింగ్ దర్శకుడు బాబి అలియాస్ కేఎస్ రవీంద్ర తాజాగా మెగాస్టార్ కు ఒక మంచి కథను వినిపించినట్టు తెలిసింది.
ఆ కథను విన్న చిరంజీవి వెంటనే బాగుందని ఓకే చెప్పాడట.. స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసి.. బౌండెడ్ స్క్రిప్ట్ తో రావాలని చిరంజీవి సూచించాడట.
నిజానికి రాంచరణ్ కొన్న మలయాళ మూవీ ‘లూసిఫర్’ రిమేక్ దర్శకుడిగా చేయించాలని మొదట అనుకున్నారట.. అయినప్పటికీ అతడు ఆ కథను నమ్ముకోకుండా మరో కొత్త కథను చిరంజీవి కోసం తయారు చేసి తీసుకొచ్చాడు. పెద్దగా హిట్స్ బాబీ ఖాతాలో లేనప్పటికీ ఇప్పుడు చెప్పిన కథ నచ్చడంతో చిరంజీవి కూడా ఓకే అన్నాడట.
కొరటాల శివతో చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత ‘లూసిఫర్’ రిమేక్ లో నటిస్తాడు. ఆ తర్వాత బాబీ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్టుకు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.