Telugu Global
International

మీ పౌరులను వెనక్కు తీసుకెళ్లండి " యూఏఈ హెచ్చరిక

కరోనా ప్రభావం అన్ని దేశాలపై పడింది. కోవిడ్-19 బారిన పడిన వారికి చికిత్స అందిస్తూనే అన్ని సదుపాయాలు అందిస్తున్నాయి ఆయా దేశాలు. కోవిడ్ 19 బారిన పడినవారు స్వదేశీయులా, విదేశీయులా అనే తేడా చూపకుండా వైద్యం అందిస్తున్నాయి. అయితే, వైరస్ సోకని వాళ్లు చాలా మంది ఆయా దేశాల్లో చిక్కుకొని పోయారు. ఇండియాలో చిక్కుకున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాల ప్రజలను ఆయా దేశాలే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లాయి. […]

మీ పౌరులను వెనక్కు తీసుకెళ్లండి  యూఏఈ హెచ్చరిక
X

కరోనా ప్రభావం అన్ని దేశాలపై పడింది. కోవిడ్-19 బారిన పడిన వారికి చికిత్స అందిస్తూనే అన్ని సదుపాయాలు అందిస్తున్నాయి ఆయా దేశాలు. కోవిడ్ 19 బారిన పడినవారు స్వదేశీయులా, విదేశీయులా అనే తేడా చూపకుండా వైద్యం అందిస్తున్నాయి.

అయితే, వైరస్ సోకని వాళ్లు చాలా మంది ఆయా దేశాల్లో చిక్కుకొని పోయారు. ఇండియాలో చిక్కుకున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాల ప్రజలను ఆయా దేశాలే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లాయి.

ఇప్పుడు యూఏఈ కూడా తమ దేశంలో చిక్కుకొని పోయిన ఇతర దేశస్థులను తీసుకొని వెళ్లమని ఆదేశాలు జారీ చేసింది. కరోనా నెగెటీవ్ వచ్చిన వాళ్లు వెంటనే దేశం విడిచి వెళ్లాలని.. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దాదాపు 90 లక్షల జనాభా ఉన్న యూఏఈలో అత్యధికులు వర్క్ వీసాలపై వచ్చిన ఇతర దేశస్థులే ఉన్నారు. పొట్టకూటి కోసం యూఏఈకి వలసవెళ్లిన వాళ్లలో పాకిస్తాన్, ఇండియా, శ్రీలంకకు చెందిన వాళ్లే ఎక్కువ. వీళ్లను తీసుకెళ్లమని యూఏఈ ఆయా దేశాలకు చెప్పినా.. విదేశాల నుంచి వచ్చే వాళ్లను ప్రస్తుతం ఏ దేశం అనుమతించకపోవడంతో వారిని తీసుకొని రావడానికి ససేమిరా అంటున్నాయి.

తమ దేశ పౌరులను తీసుకొని వెళ్లడానికి ఆయా దేశాలు వెనకడుగు వేయడం యూఏఈకి ఆగ్రహం తెప్పించింది. వెంటనే వారిని తీసుకొని వెళ్లకపోతే వర్క్ వీసాలపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం అక్కడ 25 వేల మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇప్పటికే యూఏఈలో 20 మంది మృతి చెందారు. అక్కడ 3,736 మందికి కరోనా పాజిటీవ్‌గా తేలింది.

First Published:  13 April 2020 7:45 AM IST
Next Story