టాలీవుడ్ కు రూ.500 కోట్లు నష్టం
టాలీవుడ్ పై కరోనా ఎఫెక్ట్ గట్టిగా పడింది. ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న భారీ సినిమాలన్నీ నిలిచిపోవడంతో పాటు.. రిలీజ్ కు రెడీ అయిన బడా మూవీస్ అన్నీ ఆగిపోయాయి. కేవలం బాక్సాఫీస్ వద్దే ఇప్పటివరకు దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చినట్టు ట్రేడ్ భావిస్తోంది. దీనికితోడు తెలంగాణలో లాక్ డౌన్ ను మరో 2 వారాలు పొడిగించడంతో అటుఇటుగా టాలీవుడ్ 200 కోట్ల రూపాయల్ని (బాక్సాఫీస్ కలెక్షన్స్ రూపంలో) పోగొట్టుకుందని ట్రేడ్ చెబుతోంది. […]
టాలీవుడ్ పై కరోనా ఎఫెక్ట్ గట్టిగా పడింది. ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న భారీ సినిమాలన్నీ నిలిచిపోవడంతో పాటు.. రిలీజ్ కు రెడీ అయిన బడా మూవీస్ అన్నీ ఆగిపోయాయి. కేవలం బాక్సాఫీస్ వద్దే ఇప్పటివరకు దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చినట్టు ట్రేడ్ భావిస్తోంది. దీనికితోడు తెలంగాణలో లాక్ డౌన్ ను మరో 2 వారాలు పొడిగించడంతో అటుఇటుగా టాలీవుడ్ 200 కోట్ల రూపాయల్ని (బాక్సాఫీస్ కలెక్షన్స్ రూపంలో) పోగొట్టుకుందని ట్రేడ్ చెబుతోంది.
లాక్ డౌన్ వల్ల రిలీజ్ ఆగిపోయిన సినిమాల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. నాని-సుధీర్ బాబు నటించిన V మూవీ నుంచి స్టార్ట్ చేస్తే.. ఒరేయ్ బుజ్జిగా, ఉప్పెన, నిశ్శబ్దం, అరణ్య, రెడ్, మిస్ ఇండియా, అల్లుడు అదుర్స్.. ఇలా చెప్పుకోదగ్గ సినిమాలే దాదాపు 10 ఉన్నాయి. ఇవన్నీ ఏప్రిల్ లో రిలీజై ఉండుంటే హిట్-ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద మనీ జనరేట్ అయి ఉండేది. ఆ మేరకు థియేటర్ క్యాంటీన్ నుంచి మూవీ ప్రొడ్యూసర్ వరకు అందరికీ లాస్.
త్వరలోనే ఈ నష్టం అనేది మరో రూపంలో కూడా టాలీవుడ్ ను దెబ్బకొట్టబోతోంది. మే నెల నుంచి థియేటర్లు ఓపెన్ అయ్యాయని అనుకున్నప్పటికీ.. అప్పటికి ప్రభుత్వం ప్రత్యేకంగా గైడ్ లైన్స్ సూచించే అవకాశం ఉంది. థియేటర్ మొత్తం నింపేయకుండా.. సోషల్ డిస్టెన్స్ ఫాలో అయ్యేలా 2 సీట్లు విడిచిపెట్టి టిక్కెట్స్ ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
దీనికితోడు కరోనా కారణంగా థియేటర్లకు వచ్చే జనాల సంఖ్య కూడా తగ్గుతుంది కాబట్టి, ఆ మేరకు టిక్కెట్ రేట్లు తగ్గే అవకాశం ఉంది. బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు స్వయంగా ఈ విశ్లేషణ చేశారు. తాత్కాలికంగా టిక్కెట్ రేట్లు తగ్గే అవకాశం ఉందన్నారాయన. సో.. ఇవన్నీ లెక్కలేసుకుంటే టాలీవుడ్ కు కేవలం ఏప్రిల్ లోనే కాకుండా, మే-జూన్ నెలల్లో కూడా నష్టాలు కొనసాగే ప్రమాదముంది.
ఇక షూటింగ్ అప్ డేట్స్ విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా నుంచి చిన్నచితకా సినిమాలన్నీ ఆగిపోయాయి. బాలకృష్ణ-బోయపాటి సినిమా, ప్రభాస్ కొత్త సినిమా, రామ్ చరణ్-ఎన్టీఆర్ RRR, నాగార్జున వైల్డ్ డాగ్, బన్నీ పుష్ప, రవితేజ క్రాక్.. ఇలా ఈ లిస్ట్ చాలా పెద్దగా ఉంది. కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి తీస్తున్న ఈ సినిమాలు ఆగిపోవడం వల్ల నిర్మాతలకు భారీగా నష్టం వస్తోంది. లాక్ డౌన్ పొడిగింపు వల్ల వీళ్లు మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. తద్వారా 24 క్రాఫ్ట్స్ అన్నీ నష్టాలు చూస్తున్నాయి. ఈ నష్టం దాదాపు 200 కోట్ల రూపాయల వరకు (వడ్డీలతో కలుపుకొని) ఉండొచ్చని ఓ అంచనా.
మరోవైపు హీరోహీరోయిన్లు రెండు రకాలుగా నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమాలు ఆగిపోవడం వల్ల వీళ్లకు నేరుగా వచ్చిన నష్టం ఉండదు. ఎందుకంటే అప్పటికే అడ్వాన్స్ తీసుకుంటారు. పైగా అగ్రిమెంట్ ప్రకారం అనుకున్నంత ఎమౌంట్ నిర్మాత ఇవ్వాల్సిందే. కాకపోతే నిర్మాతలతో ఉన్న అనుబంధంతో పాటు హ్యూమన్ యాంగిల్ లో ఆలోచించి హీరోహీరోయిన్లంతా తమ రెమ్యూనరేషన్ ను తగ్గించుకునే అవకాశం ఉంది.
దీంతో పాటు అటు బ్రాండింగ్ పరంగా కూడా హీరోహీరోయిన్లు చాలా నష్టపోతున్నారు. హీరోయిన్లకు షాప్ ఓపెనింగ్స్ లేవు. ఫొటో షూట్స్ లేవు. కొత్త ఎండార్స్ మెంట్స్, డాన్స్ ప్రొగ్రామ్స్ లేవు. అటు హీరోలకు కూడా యాడ్ రెవెన్యూ బాగా తగ్గిపోనుంది. కొత్తగా యాడ్స్ వచ్చే అవకాశాలు తక్కువ. మరోవైపు పాత యాడ్స్ ను, ఆల్రెడీ రాసుకున్న అగ్రిమెంట్స్ ను రివ్యూ చేసేందుకు కార్పొరేట్ కంపెనీలన్నీ రెడీ అవుతున్నాయి.
ఇలా మొత్తంగా చూసుకుంటే.. కరోనా వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 500 కోట్ల రూపాయల నష్టం వస్తోంది.