ఆ రెండు జిల్లాల్లో కరోనా కేసులు లేవు !
ప్రపంచం మొత్తం ఇప్పుడు అల్లాడిపోతోంది. కరోనా మహమ్మారి ప్రతి దేశానికి పాకింది. ఒకటో రెండు కేసులు ప్రతి జిల్లాలో నమోదు అవుతున్నాయి. ఏపీలో మాత్రం ఇప్పటివరకూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. విశాఖపట్టణంలో ఇప్పటివరకూ 24 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కానీ ఈ రెండు జిల్లాలకు మాత్రం ఇంకా వైరస్ పాకలేదు. అటు చత్తీస్‌గఢ్, ఒడిషాతో సరిహద్దులు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో కూడా కరోనా మహమ్మారి వ్యాపించింది. ఇటు ఏపీ […]
ప్రపంచం మొత్తం ఇప్పుడు అల్లాడిపోతోంది. కరోనా మహమ్మారి ప్రతి దేశానికి పాకింది. ఒకటో రెండు కేసులు ప్రతి జిల్లాలో నమోదు అవుతున్నాయి. ఏపీలో మాత్రం ఇప్పటివరకూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. విశాఖపట్టణంలో ఇప్పటివరకూ 24 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కానీ ఈ రెండు జిల్లాలకు మాత్రం ఇంకా వైరస్ పాకలేదు. అటు చత్తీస్‌గఢ్, ఒడిషాతో సరిహద్దులు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో కూడా కరోనా మహమ్మారి వ్యాపించింది.
ఇటు ఏపీ వ్యాప్తంగా 405 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అన్ని జిల్లాల్లో డబుల్ డిజిట్ కేసులు నమోదు అయ్యాయి. శనివారం 24 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. అత్యధికంగా కర్నూలులో 82, గుంటూరులో 75 పాజిటివ్ కేసులు వచ్చాయి. అనంతపురంలో అతి తక్కువగా 15 కేసులు బయటపడ్డాయి. శనివారం సాయంత్రం ఐదు గంటలకు 7,201 శాంపిల్స్ పరీక్షించారు.
శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం పట్ల అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. మిగతా జిల్లాల కంటే ఈ జిల్లాల్లో ముందే అలర్ట్ అయ్యారని…ఓ టీమ్‌గా ఏర్పడి చర్యలు తీసుకున్నారని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.
ఢిల్లీలోని తబ్లీగ్ జమాతే వల్ల అన్ని జిల్లాల్లో కేసులు పెరిగిపోయాయి. అయితే శ్రీకాకుళం జిల్లాలో కూడా 27 మంది జమాతేతో డైరెక్టు, ఇన్ డైరెక్టు లింక్‌లు ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో వారిని వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించారు. విదేశాల నుంచి వచ్చిన 1,445 మందితో పాటు వారితో డైరెక్టు, ఇన్ డైరెక్టు కాంటాక్ట్‌లు ఉన్న 4,271 మందిని క్వారంటైన్‌లో ఉంచారు.
అయితే నలుగురిలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని…కానీ పాజిటివ్ రాదేని శ్రీకాకుళం జిల్లా వైద్యాధికారి చెంచయ్య చెప్పారు. నెల్లూరు, గుంటూరు, విశాఖపట్టణం నుంచి వచ్చినవారు ఎవరైనా జిల్లాలో అడుగుపెడితే వారిని వెంటనే ఐసోలేషన్ సెంటర్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.
విజయనగరం జిల్లాలో 434 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉంటే…వారిని క్వారంటైన్‌లో ఉంచారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. జిల్లాలో తబ్లిగ్ జమాతే లింక్‌లు లేకపోవడం అదృష్టమని ఆ జిల్లా వైద్యాధికారి చెప్పారు.