Telugu Global
International

న్యూయార్క్‌లో అత్యధిక మరణాలకు కారణమేంటి..?

ఆ నగరం అగ్రరాజ్యానికి ఆర్థిక రాజధాని. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసించగలిగే స్టాక్ మార్కెట్లు కొలువై ఉన్న నగరం. ఆధునికతకు, అభివృద్దికి మారుపేరు. పటిష్టమైన రక్షణ వ్యవస్థ కలిగిన నగరం. కానీ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా విలవిల్లాడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు నమోదు చేసింది. అదే న్యూయార్క్ నగరం. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటీవ్ కేసులు, కరోనా మరణాలు నమోదైన దేశం అమెరికా. ఇక ఆ దేశంలో కరోనా కేసులు నమోదైన తొలి […]

న్యూయార్క్‌లో అత్యధిక మరణాలకు కారణమేంటి..?
X

ఆ నగరం అగ్రరాజ్యానికి ఆర్థిక రాజధాని. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసించగలిగే స్టాక్ మార్కెట్లు కొలువై ఉన్న నగరం. ఆధునికతకు, అభివృద్దికి మారుపేరు. పటిష్టమైన రక్షణ వ్యవస్థ కలిగిన నగరం. కానీ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా విలవిల్లాడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు నమోదు చేసింది. అదే న్యూయార్క్ నగరం.

ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటీవ్ కేసులు, కరోనా మరణాలు నమోదైన దేశం అమెరికా. ఇక ఆ దేశంలో కరోనా కేసులు నమోదైన తొలి నగరం న్యూయార్క్. అమెరికాలో 5,32,879 కరోనా పాజిటీవ్ కేసులుండగా ఒక్క న్యూయార్క్ నగరంలోనే 1,81,114 కేసులు నమోదయ్యాయి. అక్కడ మృతుల సంఖ్య 9 వేలకు చేరువలో ఉంది. దీంతో న్యూయార్క్ నగరంలోని ఆసుపత్రుల్లో మృతదేహాలే కనపడుతున్నాయి.

ఇప్పటికే కరోనాతో బాధపడుతున్న వారి నుంచి ఆరోగ్య వంతులను కాపాడలేక అక్కడి వైద్య సిబ్బందికి తలకు మించిన భారమవుతోంది. కాగా న్యూయార్క్‌లో ఇంతలా కరోనా కేసులు పెరిగిపోవడానికి కారణమేంటని ఒక అధ్యయనం నిర్వహించగా పలు విషయాలు వెల్లడయ్యాయి.

  • అమెరికాలోని మిగతా ప్రాంతాలకంటే న్యూయార్క్ నగరానికి రెండు వారాల ముందే కరోనా ప్రవేశించింది.
  • న్యూయార్క్‌లో కరోనా సోకిన 100 మందిలో 4.7గురు చనిపోతున్నారు. అమెరికాలోని మిగతా ప్రాంతాల్లో దీని శాతం 3.4గా ఉంది.
  • అమెరికాలో అత్యంత జనసాంద్రత కలిగిన నగరం న్యూయార్క్. ఆ నగరం జనాభా 80 లక్షలు.
  • ఈ నగరంలో అపార్ట్‌మెంట్ల అద్దెలు చాలా ఎక్కువగా ఉండటంతో ఒకే ఫ్లాట్‌లో ఎక్కువ మంది నివసిస్తున్నారు. దీంతో కరోనా వేగంగా సోకింది.
  • న్యూయార్క్ ప్రజలు ఫ్లూ షాట్స్ (ఒక రకమైన వ్యాక్సిన్) వాడుతుంటారు. దీంతో సహజంగా ఉండే వ్యాధి నిరోదక శక్తి తగ్గిపోయింది. ఫలితంగా కరోనా వైరస్‌ను ఎదుర్కునే శక్తి లేకుండా పోయింది.
  • న్యూయార్క్‌లోని పేదలకు సరైన చికిత్స అందించట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడి నల్లజాతీయుల్లో మరణాల సంఖ్య అధికంగా ఉంది.
  • న్యూయార్క్‌లో కరోనా బారిన పడి మరణించిన వారిలో 62 శాతం మంది నల్లజాతీయులే.
  • న్యూయార్క్ నగరంలో 60 నుంచి 80 ఏళ్ల వారే ఎక్కువగా మరణించారు. వారికి బీపీ, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాదులు కూడా ఉన్నాయి.
  • ఇక ప్రస్తుతం న్యూయార్క్‌లో 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. కరోనా 30 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుందని శాస్త్రజ్ఞలు చెబుతున్నారు.
First Published:  12 April 2020 1:53 AM GMT
Next Story