లాక్ డౌన్ సమయాన్ని ఎన్టీఆర్ కు కేటాయించాడట !
మన అగ్రదర్శకులు తామే సూపర్ క్రియేటివ్స్ అని మూడు నాలుగు నెలల్లో కథలను వండి స్టార్ హీరోలతో సినిమాలు లాగించేస్తుంటారు. అలా త్రివిక్రమ్ తీసిన ‘అజ్ఞాతవాసి’, సుకుమార్ తీసిన ‘1 నేనొక్కడినే’ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అందుకే ఇప్పుడు మహేష్ బాబు లాంటి హీరోలు బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు. మంచి కథ అయితేనే చేస్తున్నాడు. కానీ హీరోల డేట్స్ కోసం వారు మళ్లీ దొరకరని దర్శకులు ఆదరబాదరగా కథలు రాసుకొని […]
మన అగ్రదర్శకులు తామే సూపర్ క్రియేటివ్స్ అని మూడు నాలుగు నెలల్లో కథలను వండి స్టార్ హీరోలతో సినిమాలు లాగించేస్తుంటారు. అలా త్రివిక్రమ్ తీసిన ‘అజ్ఞాతవాసి’, సుకుమార్ తీసిన ‘1 నేనొక్కడినే’ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
అందుకే ఇప్పుడు మహేష్ బాబు లాంటి హీరోలు బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు. మంచి కథ అయితేనే చేస్తున్నాడు.
కానీ హీరోల డేట్స్ కోసం వారు మళ్లీ దొరకరని దర్శకులు ఆదరబాదరగా కథలు రాసుకొని సినిమాలు మొదలుపెట్టి ఫ్లాపులు కొనితెచ్చుకుంటారు.
‘అజ్ఞాత వాసి ’ భారీ ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మారిపోయాడు. మంచి కథల కోసం టైం తీసుకొని ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురం’ తీసి తన సత్తాను మళ్లీ నిరూపించుకున్నాడు.
తాజాగా మళ్లీ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా తీయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ‘అయిననూ పోయి రావెల హస్తినకు’ అనే సినిమాగా అనుకున్నారట.
అయితే ఇప్పుడు కరోనాతో కావాల్సినంత టైం దొరికింది. దీంతో ఈ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇప్పుడు తన కథకు బాగా సానబెడుతున్నాడట.. ఎన్టీఆర్ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేస్తున్నాడట.. కరోనా, లాక్ డౌన్ తో కావాల్సినంత టైం దొరకడం త్రివిక్రమ్ కు ప్లస్ గా మారింది. ఇది ఎన్టీఆర్ కు కూడా వరంగా మారింది.
మే నుంచి త్రివిక్రమ్ మూవీలో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడు. ఈ లోపు కథను మరింత క్రియేటివ్ గా తీర్చిదిద్దడానికి త్రివిక్రమ్ కు అవకాశం దొరికింది. కథపై పూర్తి మనసు పెట్టి బాగా తీర్చిదిద్దుతున్నాడని తెలిసింది. ఆర్ఆర్ఆర్ తర్వాత దానికి సరితూగేలా ఎన్టీఆర్ కు హిట్ ఇవ్వడానికి త్రివిక్రమ్ తెగ కష్టపడుతున్నట్టు సమాచారం.