లాక్‌డౌన్ లేకుంటే ఏం జరిగేదో తెలుసా..?
కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. తెలంగాణ, పంజాబ్, ఒడిషా ప్రభుత్వాలు ఒకడుగు ముందేకేసి ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. కేంద్రం కూడా ఇవ్వాలో రేపో లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. లాక్‌డౌన్ నిబంధనలు, భౌతిక దూరం పాటించడం వల్లే కరోనాను చాలా వరకు కట్టడి చేయగలిగామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా, ఒక వేళ దేశంలో లాక్‌డౌన్ కనుక లేనట్లయితే ఇప్పటి వరకు 8.2 […]
కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. తెలంగాణ, పంజాబ్, ఒడిషా ప్రభుత్వాలు ఒకడుగు ముందేకేసి ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. కేంద్రం కూడా ఇవ్వాలో రేపో లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. లాక్‌డౌన్ నిబంధనలు, భౌతిక దూరం పాటించడం వల్లే కరోనాను చాలా వరకు కట్టడి చేయగలిగామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కాగా, ఒక వేళ దేశంలో లాక్‌డౌన్ కనుక లేనట్లయితే ఇప్పటి వరకు 8.2 లక్షల మందికి కరోనా వైరస్ సోకేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్న తీరుపై జరిపిన విశ్లేషణలో ఈ విషయం వెల్లడైనట్లు కేంద్రం చెప్పింది.
లాక్‌డౌన్ లేకుండా కేవలం ఇతర చర్యలు మాత్రమే తీసుకొని కోవిడ్-19ను కట్టడి చేయాలని భావించి ఉంటే కచ్చితంగా లక్షల్లో కేసులు నమోదయ్యేవని ఆ నివేదిక తెలిపింది. కేసులు 41 శాతం మేర పెరిగేవని.. దీంతో దేశంలో శాంతి భద్రతల సమస్య కూడా పెరిగేదని తెలిసింది. కరోనా కేసులు పెరగడంతో మరణాల సంఖ్య కూడా భారీగా ఉండేదని కేంద్రం వెల్లడించింది.
ఏప్రిల్ 15 నాటికి 8.2 లక్షల మంది కరోనా పాజిటీవ్‌గా తేలి ఉంటే.. దాదాపు 25 వేల మంది మృతి చెందేవారని ఆ నివేదిక చెప్పింది.
ప్రస్తుతం ఇండియాలో 8,356 మంది కరోనా బారిన పడగా.. 273 మంది మృత్యువాత పడ్డారు.