జై కేసీఆర్ అంటూ.... బండ్ల వరుస ట్వీట్స్
బండ్ల గణేష్… టాలీవుడు సినీ నిర్మాత, నటుడు… ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లి చేతులు కాల్చుకున్నాడు. తర్వాత మళ్లీ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం లాక్ డౌన్ తో తన పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైందని వాపోతున్నాడు. ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే బండ్ల గణేష్ తాజాగా నిన్న సీఎం కేసీఆర్ తెలంగాణలో లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకు పొడిగించడంపై స్పందించాడు. వరుస ట్వీట్స్ తో కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. […]
బండ్ల గణేష్… టాలీవుడు సినీ నిర్మాత, నటుడు… ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లి చేతులు కాల్చుకున్నాడు. తర్వాత మళ్లీ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం లాక్ డౌన్ తో తన పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైందని వాపోతున్నాడు.
ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే బండ్ల గణేష్ తాజాగా నిన్న సీఎం కేసీఆర్ తెలంగాణలో లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకు పొడిగించడంపై స్పందించాడు. వరుస ట్వీట్స్ తో కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ ట్వీట్ చేస్తూ.. ‘ మా క్షేమం కోసం, సమాజం కోసం, మా పిల్లల కోసం, మా భవిష్యత్ కోసం మీరు తీసుకునే నిర్ణయాల్లో సరిలేరు నీకెవ్వరు గౌరవనీయులైన ముఖ్య మంత్రి కేసీఆర్ గారూ’ అంటూ ట్వీట్ లో ప్రశంసలు కురిపించారు.
ఇక మరో ట్వీట్ లో అయితే.. ‘నాలుగు రోజులు కాదు.. సార్.. మీ మీద నమ్మకంతో భరోసాతో 40 రోజులు ఓపికతో ఇళ్లకే పరిమితం అవుతాం.. విజయం సాధిస్తాం.. జై కేసీఆర్’ అంటూ బండ్ల గణేష్ ఆకాశానికెత్తేశాడు.
మా క్షేమం కోసం సమాజం కోసం మా పిల్లల కోసం మా భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాల్లో సరిలేరు నీకెవ్వరు గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు@TelanganaCMO
— BANDLA GANESH (@ganeshbandla) April 11, 2020
నాలుగు రోజులు కాదుసార్ మీద నమ్మకం తో మీరు ఉన్నారు అన్న భరోసాతో 40 రోజులు అయినా ఓపికతో ఇళ్ల కే పరిమితం అవుతోంది విజయం సాధిస్తాం జై కేసీఆర్@TelanganaCMO
— BANDLA GANESH (@ganeshbandla) April 11, 2020
మీరు చేసే కార్యక్రమాలు మీరు తీసుకునే నిర్ణయాలు అన్ని భగవంతునితో జయప్రదం కావాలని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ప్రేమ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బండ్ల గణేష్@TelanganaCMO
— BANDLA GANESH (@ganeshbandla) April 11, 2020
ఈ కఠోరమైన సమయంలో రాజకీయాలను పక్కన పెట్టి కెసిఆర్ నాయకత్వంలో పని చేసి తెలంగాణ ప్రజలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలని అందర్నీ వేడుకుంటూ మీ బండ్ల గణేష్@TelanganaCMO
— BANDLA GANESH (@ganeshbandla) April 11, 2020
భారతదేశ చరిత్రలో ఇటువంటి సమయాల్లో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు@TelanganaCMO
— BANDLA GANESH (@ganeshbandla) April 11, 2020
ఎన్ని కష్టాలైనా భరిస్తాం ఎన్ని రోజులు ఎదురు చూస్తాం మాకు మీరు ఉన్నారని భరోసా మీరు ఉన్నారనే ధైర్యం మీరు రక్షిస్తారు నమ్మకం జై కేసీఆర్@TelanganaCMO
— BANDLA GANESH (@ganeshbandla) April 11, 2020