Telugu Global
National

దాతృత్వంలోనూ సచినే మాస్టర్

నెలకు 5 వేలమందికి సచిన్ ఆహారం ఉన్నవారు తమకున్నదానిలో కొంత లేనివారికి పంచితే వారి సంపద మరింత పెరుగుతుందన్నది పెద్దల మాట. క్రికెటర్ సచిన్ టెండుల్కర్.. అన్నార్తులకు ఆపన్నహస్తం అందించడంలో తనకుతానే సాటిగా నిలుస్తున్నాడు. కరోనా బాధితుల సహాయ నిథికి…ఇప్పటికే భారత ప్రధాని, మహారాష్ట్ర్ర ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయల చొప్పున… మొత్తం 50 లక్షల రూపాయలు అందచేశాడు. అంతేకాదు..తన రాష్ట్ర్రం మహారాష్ట్ర్లలో, ప్రధానంగా ముంబై మహానగరంలో…లాక్ డౌన్ దెబ్బతో ఆహారం అందక అల్లాడుతున్న వారికి అండగా నిలవాలని […]

దాతృత్వంలోనూ సచినే మాస్టర్
X
  • నెలకు 5 వేలమందికి సచిన్ ఆహారం

ఉన్నవారు తమకున్నదానిలో కొంత లేనివారికి పంచితే వారి సంపద మరింత పెరుగుతుందన్నది పెద్దల మాట. క్రికెటర్ సచిన్ టెండుల్కర్.. అన్నార్తులకు ఆపన్నహస్తం అందించడంలో తనకుతానే సాటిగా నిలుస్తున్నాడు.

కరోనా బాధితుల సహాయ నిథికి…ఇప్పటికే భారత ప్రధాని, మహారాష్ట్ర్ర ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయల చొప్పున… మొత్తం 50 లక్షల రూపాయలు అందచేశాడు. అంతేకాదు..తన రాష్ట్ర్రం మహారాష్ట్ర్లలో, ప్రధానంగా ముంబై మహానగరంలో…లాక్ డౌన్ దెబ్బతో ఆహారం అందక అల్లాడుతున్న వారికి అండగా నిలవాలని సచిన్ నిర్ణయించాడు.

ముంబై మురికివాడల్లోని లక్షలాదిమంది బాలలకు ఇప్పటికే తాను నెలకొల్పిన అప్నాలయ ట్రస్టు ద్వారా…ఆరోగ్య, ఆహార, వైద్య, విద్యా సదుపాయాలు అందచేస్తున్న సచిన్… ప్రస్తుత కరోనా ప్రళయం సమయంలో సైతం… ఆహారం అందక అలమటించిపోతున్ననిర్భాగ్యులకు తనవంతుగా సాయం చేయటానికి ముందుకు వచ్చాడు.

నెలకు 5వేల మందికి కడుపునిండా భోజనం పెట్టడానికి తన అప్నాలయ ట్రస్ట్ ద్వారా ఏర్పాట్లు చేశాడు. ప్రపంచ దేశాలతో పాటు మనదేశం సైతం.. కరోనా దెబ్బతో ఉక్కిరిబిక్కిరవుతోందని, కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలు మూడువారాల లాక్ డౌన్ ప్రకటించినా రోజురోజుకూ వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య పెరిగిపోవడం పట్ల సచిన్ ఆందోళన వ్యక్తం చేశాడు.

దేశంలోని ప్రతిఒక్కరూ విధిగా లాక్ డౌన్ ను పాటించితీరాలని, తమను తాము కాపాడుకోడం ద్వారా ఇరుగుపొరుగువారినీ కాపాడాలని, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత ప్రధానమని సూచించాడు.

లాక్ డౌన్ సమయంలో నిరుపేదలు ఆకలితో అలమటించకుండా ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు ఆదుకొంటున్నాయి, తాను సైతం ఎంతోకొంత చేయటం అదృష్టంగా భావిస్తున్నట్లు అప్నాలయ ట్రస్ట్ నిర్వాహకులకు సచిన్ తెలిపాడు.

First Published:  11 April 2020 10:37 AM IST
Next Story