ఉద్దవ్ ఠాక్రే సీఎం పోస్టుకు గండం.. అంతా గవర్నర్ చేతిలో..!
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సీఎం పోస్టుకు గండం వచ్చి పడింది. ఆయన శాసన సభ, మండలిలో ఎలాంటి సభ్యత్వం లేకుండానే సీఎంగా ఎంపికయ్యారు. కాగా, ఆరు నెలల లోపు ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ ఎన్నికవ్వాల్సిన అవసరం ఉంది. మే 28 నాటికి ఆయన సీఎం పదవి చేపట్టి ఆరు నెలలు పూర్తి కానుంది. ఆ లోపు ఆయన తప్పకుండా ఏదో ఒక పదవికి ఎన్నిక కావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే ఛాన్స్ […]
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సీఎం పోస్టుకు గండం వచ్చి పడింది. ఆయన శాసన సభ, మండలిలో ఎలాంటి సభ్యత్వం లేకుండానే సీఎంగా ఎంపికయ్యారు. కాగా, ఆరు నెలల లోపు ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ ఎన్నికవ్వాల్సిన అవసరం ఉంది. మే 28 నాటికి ఆయన సీఎం పదవి చేపట్టి ఆరు నెలలు పూర్తి కానుంది. ఆ లోపు ఆయన తప్పకుండా ఏదో ఒక పదవికి ఎన్నిక కావాలి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే ఛాన్స్ లేదు. ఇప్పటికిప్పుడు ఏ ఎమ్మెల్యే రాజీనామా చేసినా ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపత్యంలో ఎన్నికల నిర్వహణకు ఈసీఐ నిర్ణయం తీసుకోదు.
ఇక ఠాక్రేకు మిగిలిన ఛాన్స్ ఎమ్మెల్సీగా ఎన్నికవడమే. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి అవకాశం ఉంది. ఆయన కోటాలో ఖాళీ ఉంది. కాని దీనికి సీఎం సిఫార్సు చేయాల్సి ఉంది. అయితే సీఎంకే ఎమ్మెల్సీ పదవి కావాలని సిఫార్సు చేసుకోవడం నైతికంగా సరైనది కాదు. దీంతో నిన్న ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది.
ఈ మంత్రిమండలి సమావేశానికి సీఎం ఠాక్రేను రావొద్దని సూచించడంతో ఆయన రాలేదని మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్ వెల్లడించారు. మంత్రి మండలి నిర్ణయంతో ఉద్దవ్ ఠాక్రే పేరును ఎమ్మెల్సీగా గవర్నర్‌కు ప్రతిపాదించినట్లు చెప్పారు.
గవర్నర్ కోటాలో ప్రస్తుతం రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్సీపీకి చెందిన రాహుల్ నర్వీకర్, రామ్ వద్‌కుటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు గతేడాది అక్టోబర్‌లో బీజేపీలో చేరడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. గవర్నర్ ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే ఠాక్రే పదవీగండం నుంచి గట్టెక్కినట్లే.