ఇకపై రీమిక్స్ సాంగ్స్ చేయను
అవసరం ఉన్నంతవరకే ఏదైనా. అవసరం తీరిన తర్వాత ఇక ఎవ్వరూ దాన్ని పట్టించుకోరు. ఉదాహరణకు బన్నీనే చూస్తే.. కెరీర్ స్టార్టింగ్ లో పవన్, చిరంజీవి పేర్లు తలుచుకోకుండా ప్రసంగాలు ముగించేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు పవన్ పేరెత్తితేనే చెప్పను బ్రదర్ అంటున్నాడు. చిరంజీవి గుండెల్లో ఉన్నాడంటూ తప్పించుకుంటున్నాడు. ఇలా మెగా మార్క్ పడకుండా జాగ్రత్త పడుతున్నాడు బన్నీ. ఇంత కాకపోయినా దాదాపు ఇదే టైపులో వ్యవహరిస్తున్నాడు సాయితేజ్ కూడా. మొన్నటివరకు తన సినిమాల మైలేజీ కోసం చిరంజీవి […]
అవసరం ఉన్నంతవరకే ఏదైనా. అవసరం తీరిన తర్వాత ఇక ఎవ్వరూ దాన్ని పట్టించుకోరు. ఉదాహరణకు బన్నీనే చూస్తే.. కెరీర్ స్టార్టింగ్ లో పవన్, చిరంజీవి పేర్లు తలుచుకోకుండా ప్రసంగాలు ముగించేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు పవన్ పేరెత్తితేనే చెప్పను బ్రదర్ అంటున్నాడు. చిరంజీవి గుండెల్లో ఉన్నాడంటూ తప్పించుకుంటున్నాడు. ఇలా మెగా మార్క్ పడకుండా జాగ్రత్త పడుతున్నాడు బన్నీ.
ఇంత కాకపోయినా దాదాపు ఇదే టైపులో వ్యవహరిస్తున్నాడు సాయితేజ్ కూడా. మొన్నటివరకు తన సినిమాల మైలేజీ కోసం చిరంజీవి పాటల్ని తెగ రీమిక్స్ చేశాడు సాయితేజ్. అతడు నటించిన సుప్రీమ్, సుబ్రమణ్యం ఫర్ సేల్, ఇంటిలిజెంట్ సినిమాల్లో చిరంజీవి సూపర్ హిట్ సాంగ్స్ కు రీమిక్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ వల్లనే ఆ సినిమాలకు అంతోఇంతో ప్రచారం కూడా దక్కింది.
కానీ ఇప్పుడు రీమిక్స్ చేయనంటున్నాడు సాయితేజ్. ఇకపై తన సినిమాల్లో రీమిక్స్ ఉండవని చెబుతున్నాడు. త్వరలోనే అతడు నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇందులో ఎలాంటి రీమిక్స్ పాటలు లేవంటున్న సాయితేజ్.. ఈ మూవీ తర్వాత రాబోతున్న దేవ్ కట్టా సినిమాలో కూడా రీమిక్స్ ఉండవని స్పష్టంచేశాడు. ఇకపై దర్శకుడు బలవంతం చేస్తే తప్ప, తనకుతానుగా చిరంజీవి రీమిక్స్ సాంగ్స్ పెట్టనంటున్నాడు సాయితేజ్.