Telugu Global
Cinema & Entertainment

అందుకే రకుల్ ప్రేమలో పడలేదట!

హీరోయిన్లు అనగానే డేటింగ్ రూమర్లు రావడం సహజం. నిజానికి వాటిలో అంతోఇంతో నిజం కూడా ఉంటుంది. కానీ ఆశ్చర్యంగా రకుల్ పై అలాంటి రూమర్లు తక్కువ. చూడ్డానికి నాజూగ్గా ఉంటుంది. అందంగా కనిపిస్తుంది. క్రేజ్ ఉంది. అయినప్పటికీ రకుల్ ప్రేమలో పడిందని, ఎవరితోనో డేటింగ్ చేస్తోందనే రూమర్స్ పెద్దగా వినిపించలేదు. దీనికి కారణం ఏంటో చెబుతోంది రకుల్. “నేను చిన్నప్పట్నుంచి అబ్బాయిలకు దూరం. నా తమ్ముడు అమన్ ప్రీత్ ఎప్పుడూ నాపై ఓ కన్నేసి ఉంచేవాడు. నేను […]

అందుకే రకుల్ ప్రేమలో పడలేదట!
X

హీరోయిన్లు అనగానే డేటింగ్ రూమర్లు రావడం సహజం. నిజానికి వాటిలో అంతోఇంతో నిజం కూడా ఉంటుంది. కానీ ఆశ్చర్యంగా రకుల్ పై అలాంటి రూమర్లు తక్కువ. చూడ్డానికి నాజూగ్గా ఉంటుంది. అందంగా కనిపిస్తుంది. క్రేజ్ ఉంది. అయినప్పటికీ రకుల్ ప్రేమలో పడిందని, ఎవరితోనో డేటింగ్ చేస్తోందనే రూమర్స్ పెద్దగా వినిపించలేదు. దీనికి కారణం ఏంటో చెబుతోంది రకుల్.

“నేను చిన్నప్పట్నుంచి అబ్బాయిలకు దూరం. నా తమ్ముడు అమన్ ప్రీత్ ఎప్పుడూ నాపై ఓ కన్నేసి ఉంచేవాడు. నేను అబ్బాయిలతో మాడ్లాడితే చాలు, ఇంట్లో అమ్మానాన్నకు చెప్పేసేవాడు. వాడికి భయపడి నేను అబ్బాయిలకు దూరంగా ఉండేవాడ్ని. అదే అలా అలవాటైపోయింది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా పెద్దగా నేను బాయ్స్ తో కలవలేదు. అందుకేనేమో నాపై డేటింగ్ రూమర్స్ తక్కువ.”

ఇలా అసలు విషయాన్ని బయటపెట్టింది రకుల్. సహనటులతో కానీ, బయట వ్యక్తులతో కానీ లింక్ చేస్తూ తనపై లవ్ ఎఫైర్ రూమర్స్ రాకపోవడానికి ఇదే కారణం అయి ఉండొచ్చని అభిప్రాయపడింది. పైగా ఖాళీ టైమ్ దొరికితే తను డేటింగ్ కంటే ఎక్సర్ సైజ్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానని, ఈ విషయం తెలిసి చాలామంది తనతో దూరంగా ఉన్నారని సరదాగా చెప్పుకొచ్చింది.

First Published:  10 April 2020 6:30 AM IST
Next Story