Telugu Global
National

ఐపీఎల్ -13కూ అదే గతి పడుతుందా?

కరోనా వైరస్ తీవ్రతతో గాల్లో దీపంలా ఐపీఎల్ భారత క్రికెట్ బోర్డు వేల కోట్ల రూపాయల వ్యాపారం ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు …కరోనా వైరస్ తీవ్రతతో గాల్లో దీపంలా మారాయి. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఈ టోర్నీని కరోనా దెబ్బతో ఏప్రిల్ 15 వరకూ వాయిదా వేశారు. అయితే…ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే…మరో వారంరోజుల్లో ఐపీఎల్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదని ఐపీఎల్ బోర్డు మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు. ప్రజలప్రాణాల తర్వతే ఐపీఎల్… […]

ఐపీఎల్ -13కూ అదే గతి పడుతుందా?
X
  • కరోనా వైరస్ తీవ్రతతో గాల్లో దీపంలా ఐపీఎల్

భారత క్రికెట్ బోర్డు వేల కోట్ల రూపాయల వ్యాపారం ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు …కరోనా వైరస్ తీవ్రతతో గాల్లో దీపంలా మారాయి. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఈ టోర్నీని కరోనా దెబ్బతో ఏప్రిల్ 15 వరకూ వాయిదా వేశారు.

అయితే…ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే…మరో వారంరోజుల్లో ఐపీఎల్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదని ఐపీఎల్ బోర్డు మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు.

ప్రజలప్రాణాల తర్వతే ఐపీఎల్…

మనదేశంలో మాత్రమే కాదు…ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ తీవ్రత రానురాను పెరిగిపోతోందని, గత 24 గంటల్లోనే భారత్ లో 591 తాజాకేసులు నమోదు కాగా.. కొత్తగా మరో 20 మరణాలు నమోదయ్యాయని… ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని రాజీవ్ శుక్లా గుర్తు చేశారు.

మార్చి 22 నుంచి ఇప్పటి వరకూ లాక్ డౌన్ పాటిస్తున్నా…భారత్ లో ఇప్పటి వరకూ 5వేల 865 కేసులు నమోదు కాగా..169 మరణాలు నమోదైనట్లు భారత ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది.

ఏప్రిల్ 14న పరిస్థితిని సమీక్షించి మరోసారి లాక్ డౌన్ కాలాన్ని పొడిగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైద్యసదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్న భారత్ లాంటి అతిపెద్ద దేశంలో కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనాలంటే లాక్ డౌన్ మినహా వేరేదారి లేదని పలు రాష్ట్ర్రాల ముఖ్యమంత్రులు మొరపెట్టుకొంటున్నారు.

ఇలాంటి క్లిష్టపరిస్థితిలో ప్రజల ప్రాణాలు కాపాడుకోడం ముఖ్యమని, ఆ తర్వాతే ఐపీఎల్ గురించి ఆలోచించడం సబబుగా ఉంటుందని రాజీవ్ శుక్లా అంటున్నారు.

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే…ఏప్రిల్ 15 తర్వాత ఐపీఎల్ సీజన్ ప్రారంభంకావడం అసాధ్యమని చెప్పారు.

ఏప్రిల్ 15 తర్వాత అసాథ్యమే..

భారత ప్రభుత్వం మార్చి 11 నుంచే విదేశీయులకు వీసాలు జారీ చేయటం నిలిపివేసిందని, విదేశీ క్రికెటర్లు మనదేశానికి రావటం అనేది అసాధ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని రాజీవ్ అంటున్నారు.

వచ్చే ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్, యూరోకప్ సాకర్, కోపా అమెరికా కప్ సాకర్, ఫార్ములావన్ కార్ రేస్ లు, వింబుల్డన్ టెన్నిస్, వివిధ దేశాల క్రికెట్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అయితే అక్టోబర్ లో ప్రారంభంకావాల్సిన టీ-20 ప్రపంచకప్, ఐపీఎల్ 13వ సీజన్ పోటీల గురించి క్రికెట్లోని కొన్ని వర్గాలు ఇంకా దింపుడుకల్లం ఆశలతో ఉన్నాయి.

పైగా..ఐపీఎల్ రద్దయితే కోట్ల రూపాయల కాంట్రాక్టు కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో విదేశీ క్రికెటర్లు సైతం…తాము అభిమానులు లేకుండానే ఖాళీ స్టేడియాలలో మ్యాచ్ లు ఆడటానికి సిద్ధమని ముందుకు వస్తున్నారు.

ఏది జరగాలన్నా కరోనా వైరస్ తల్లి కరుణించి ఉపశమిస్తేనే..స్తంభించిన జనజీవనం తిరిగి గాడిన పడగలుగుతుంది. అప్పటి వరకూ బ్రతికుంటే బలుసాకు తినవచ్చునన్న సామెతను ప్రతిఒక్కరూ గుర్తుంచుకొని.. ఇంటిపట్టునే ఉంటూ లాకౌట్ మంత్రాన్ని జపిస్తూ బిక్కుబిక్కుమంటూ గడపక తప్పదు.

First Published:  10 April 2020 2:32 AM IST
Next Story