Telugu Global
National

5 వేలకు చేరువలో కరోనా కేసులు... పాక్‌లో నో లాక్‌డౌన్‌

పాకిస్తాన్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటివరకూ 4,332 కేసులు నమోదు అయ్యాయి. అవి పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు రోజుల్లో ఐదువేలకు చేరే అవకాశం ఉంది. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ కూడా పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని…ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాత్రమే కోరుతున్నారు. కానీ దేశంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. పాకిస్తాన్‌లో రెండు రోజుల్లో 248 కేసులు పెరిగాయి. 572 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఐదుగురు […]

5 వేలకు చేరువలో కరోనా కేసులు... పాక్‌లో నో లాక్‌డౌన్‌
X

పాకిస్తాన్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటివరకూ 4,332 కేసులు నమోదు అయ్యాయి. అవి పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు రోజుల్లో ఐదువేలకు చేరే అవకాశం ఉంది. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ కూడా పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని…ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాత్రమే కోరుతున్నారు. కానీ దేశంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించేందుకు మాత్రం ముందుకు రావడం లేదు.

పాకిస్తాన్‌లో రెండు రోజుల్లో 248 కేసులు పెరిగాయి. 572 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఐదుగురు చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 64కి చేరింది. 31 మంది రోగులు ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు.

పాక్ లో పంజాబ్‌ రాష్ట్రంలో 2,100 మంది కరోనా బాధితులు ఉన్నారు. అయితే ఇమ్రాన్‌ఖాన్‌ మాత్రం ప్రజలను ఇళ్లలోనే ఉండాలని కోరుతున్నారు. ఒక్కసారి వైరస్‌ విజృంభిస్తే యూరప్‌ కంటే దారుణంగా పరిస్థితులు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ప్రజలను రక్షించేందుకు కనీస వైద్య సౌకర్యాలు కూడా దేశంలో లేవని చెప్పుకొస్తున్నారు .

ఇవన్నీ చెబుతున్న ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రం దేశంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించేందుకు ససేమిరా అంటున్నారు. 50 లక్షల మంది దారిద్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలు ఉన్నారని… వారు రోజూ పనిచేయకపోతే పూట గడవదని…. లాక్‌డౌన్‌ విధిస్తే వారి పరిస్థితి ఏంటి అనేది ఆయన ప్రశ్న.

పంజాబ్‌, సింధ్‌ రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదు కావడంతో… అక్కడి రాష్ట్రాలు ఎక్కువగా ఆంక్షలు విధిస్తున్నాయి. ఇమ్రాన్‌ ఖాన్‌ మాటను పట్టించుకోవడం లేదు. తాజాగా ఏప్రిల్‌ 14 వరకు ఆంక్షలు పొడిగించారు. పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించలేదు. ప్రజలను ఇంట్లోనే ఉండాలని కోరడం తప్ప…. ఇంకేమీ చేయడం లేదు.

First Published:  9 April 2020 8:14 PM GMT
Next Story