Telugu Global
International

క్రికెట్ కామెంట్రీకి త్వరలో హోల్డింగ్ గుడ్ బై

21 ఏళ్లుగా స్కైస్పోర్ట్స్ తో అనుబంధం కరీబియన్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం, విఖ్యాత కామెంటీటర్ మైకేల్ హోల్డింగ్….క్రికెట్ వ్యాఖ్యానం నుంచి తాను విరమించుకొనే రోజులు దగ్గరపడ్డాయని ప్రకటించాడు. వెస్టిండీస్ జట్టు తరపున 60 టెస్ట్ మ్యాచ్ లు ఆడటమేకాదు..రోల్స్ రాయస్ పేరుతో అరివీరభయంకర ఫాస్ట్ బౌలర్ గా పేరుపొందిన హోల్డింగ్…రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ వ్యాఖ్యాతగా స్థిరపడ్డాడు. ఇంగ్లండ్ కు చెందిన స్కై స్పోర్ట్స్ బ్రాడ్ కాస్టర్ తరపున గత 21 సంవత్సరాలుగా కామెంటీటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. జెఫ్ […]

క్రికెట్ కామెంట్రీకి త్వరలో హోల్డింగ్ గుడ్ బై
X
  • 21 ఏళ్లుగా స్కైస్పోర్ట్స్ తో అనుబంధం

కరీబియన్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం, విఖ్యాత కామెంటీటర్ మైకేల్ హోల్డింగ్….క్రికెట్ వ్యాఖ్యానం నుంచి తాను విరమించుకొనే రోజులు దగ్గరపడ్డాయని ప్రకటించాడు.

వెస్టిండీస్ జట్టు తరపున 60 టెస్ట్ మ్యాచ్ లు ఆడటమేకాదు..రోల్స్ రాయస్ పేరుతో అరివీరభయంకర ఫాస్ట్ బౌలర్ గా పేరుపొందిన హోల్డింగ్…రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ వ్యాఖ్యాతగా స్థిరపడ్డాడు.

ఇంగ్లండ్ కు చెందిన స్కై స్పోర్ట్స్ బ్రాడ్ కాస్టర్ తరపున గత 21 సంవత్సరాలుగా కామెంటీటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. జెఫ్ బాయ్ కాట్, డేవిడ్ గోవర్, ఇయాన్ బోథమ్, మైకేల్ అథెర్టన్, నాసిర్ హుస్సేన్, షేన్ వార్న్, ఇయాన్ స్మిత్ లతో కలసి కామెంట్రీ చెబుతూ వస్తున్నాడు.

తన వయసు 26, 46, 56 సంవత్సరాలో కాదని…ప్రస్తుతం 66వ పడిలో ఉన్నానని..2021 సీజన్ వరకూ తాను కొనసాగాలని భావిస్తున్నట్లు తెలిపాడు.

చక్కటి వ్యాఖ్యాతగా గుర్తింపు తెచ్చుకొన్న హోల్డింగ్ ..గత రెండుదశాబ్దాలుగా తనను ఆదరిస్తూ వచ్చిన స్కైస్పోర్ట్స్ కు రుణపడి ఉంటానని ప్రకటించాడు.

టెస్ట్ క్రికెటర్ గా దశాబ్దాల క్రితం రిటైరైన తాను…క్రికెట్ వ్యాఖ్యాతగా మరోసారి రిటైర్ కాబోతున్నట్లు తెలిపాడు. తాను పూర్తిగా రిటైర్ కాబోయే లోపు కరీబియన్ క్రికెట్లో ప్రతిభావంతులైన క్రికెటర్లను చూడాలని కలలు కన్నానని… ఆ కలను నెరవేర్చడానికా అన్నట్లు నికోలస్ పూరన్, హెట్ మేయర్, షై హోప్ వెలుగులోకి వచ్చారని…వెస్టిండీస్ క్రికెట్ భవిష్యత్ ఈ ముగ్గురిపైనే ఆధారపడి ఉందని హోల్డింగ్ అభిప్రాయపడ్డాడు.

క్రికెట్ ఆటగాడిగా సంపాదించిన దానికంటే…క్రికెట్ కామెంటీటర్ గానే అధికమొత్తంలో హోల్డింగ్ ఆర్జించడం విశేషం.

First Published:  10 April 2020 1:40 AM IST
Next Story