Telugu Global
NEWS

లాక్‌డౌన్‌ వేళ సీమలో పొలిటికల్‌ భేటీ

కరోనా…కరోనా…దేశమంతటా ఇదే చర్చ. ఏ చానల్‌ చూసినా,…ఏ పేపర్‌ చూసినా ఇదే టాపిక్‌. కరోనా తగ్గేదెప్పుడు? బయట కాలు పెట్టేదెప్పుడు? అంటూ అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక కొందరు రాజకీయ నాయకులు కూడా ఇంటికి పరిమితమయ్యారు. ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే ఇదే టైమ్‌లో ఏపీలో ఓ పొలిటికల్‌ భేటీ ఇంట్రెస్టింగ్‌గా మారింది. రాయలసీమ జిల్లాలకు చెందిన ముగ్గురు నేతలు ఓ చోట సమావేశమయ్యారు. లాక్‌డౌన్‌ వేళ తీరిగ్గా రెండు గంటలు మాట్లాడుకున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో […]

లాక్‌డౌన్‌ వేళ సీమలో పొలిటికల్‌ భేటీ
X

కరోనా…కరోనా…దేశమంతటా ఇదే చర్చ. ఏ చానల్‌ చూసినా,…ఏ పేపర్‌ చూసినా ఇదే టాపిక్‌. కరోనా తగ్గేదెప్పుడు? బయట కాలు పెట్టేదెప్పుడు? అంటూ అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక కొందరు రాజకీయ నాయకులు కూడా ఇంటికి పరిమితమయ్యారు. ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే ఇదే టైమ్‌లో ఏపీలో ఓ పొలిటికల్‌ భేటీ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

రాయలసీమ జిల్లాలకు చెందిన ముగ్గురు నేతలు ఓ చోట సమావేశమయ్యారు. లాక్‌డౌన్‌ వేళ తీరిగ్గా రెండు గంటలు మాట్లాడుకున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆ ముగ్గురు నేతలు ఒకరు మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి.

అనంతపురం జిల్లాలోని పెద్దప్పూరు మండలంలో జేసీ దివాకర్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఈ ముగ్గురు నేతలు సమావేశమయ్యారు. సుమారు రెండు గంటల పాటు రాజకీయ అంశాలపై వీరు చర్చించారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ భేటీ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

జేసీ దివాకర్‌ రెడ్డి, బీటెక్‌ రవిలను బీజేపీలోకి ఆహ్వానించేందుకు సీఎం రమేష్‌ వారితో భేటీ అయ్యారని ఓవార్త విన్పిస్తోంది. ఇప్పటికే బీజేపీలో చేరేందుకు జేసీ బ్రదర్స్‌ కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే కమలం నేతల నుంచి క్లియరెన్స్‌ రాలేదని తెలుస్తోంది.

ఇటు కడప జిల్లాకు చెందిన బీటెక్‌ రవి సైతం బీజేపీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీలో ఉండే పరిస్థితి లేదనేది ఆయన భావన.

ఇప్పటికే పులివెందుల టీడీపీ ఇంచార్జ్‌ సతీష్‌ రెడ్డి ఆపార్టీని వీడారు. అయితే ఆయన వైసీపీ కండువా కప్పుకోలేదు. దీంతో ఆయన వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన మాత్రం ఇంతవరకూ ఏ పార్టీలో చేరలేదు. దీంతో ఈ ముగ్గురు నేతల భేటీలో ఏం చర్చించారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

First Published:  9 April 2020 12:35 PM IST
Next Story