Telugu Global
International

భారత్ కు ఆ ఖర్మ పట్టలేదు " కపిల్ దేవ్

పాక్ తో సహాయక మ్యాచ్ లు అవసరం లేదన్న గ్రేట్ క్రికెట్ దాయాదులు భారత్-పాక్…కరోనా వైరస్ సహాయక క్రికెట్ సిరీస్ ఆడాలంటూ పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన ప్రతిపాదనను భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ గట్టిగా తిప్పికొట్టాడు. కరోనా వైరస్ మహమ్మారితో ఓ వైపు ప్రపంచదేశాలు తల్లడిల్లిపోతుంటే…నిధుల కోసం సహాయక సిరీస్ ఆడటాన్ని మించిన అర్థంలేని పని మరొకటి లేదని 61 సంవత్సరాల కపిల్ దేవ్ చెప్పాడు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, దానిని […]

భారత్ కు ఆ ఖర్మ పట్టలేదు  కపిల్ దేవ్
X
  • పాక్ తో సహాయక మ్యాచ్ లు అవసరం లేదన్న గ్రేట్

క్రికెట్ దాయాదులు భారత్-పాక్…కరోనా వైరస్ సహాయక క్రికెట్ సిరీస్ ఆడాలంటూ పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన ప్రతిపాదనను భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ గట్టిగా తిప్పికొట్టాడు.

కరోనా వైరస్ మహమ్మారితో ఓ వైపు ప్రపంచదేశాలు తల్లడిల్లిపోతుంటే…నిధుల కోసం సహాయక సిరీస్ ఆడటాన్ని మించిన అర్థంలేని పని మరొకటి లేదని 61 సంవత్సరాల కపిల్ దేవ్ చెప్పాడు.

ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, దానిని మనం గౌరవించాలని…అయితే నిధుల కోసం సహాయ క్రికెట్ మ్యాచ్ లు ఆడాల్సిన ఖర్మ మాత్రం భారత్ కు పట్టలేదని కపిల్ అన్నాడు.

కష్టాలలో ఉన్న ఇరుగుపొరుగువారికి సాయం చేసే గుణం భారత సంస్కృతిలోనే ఉందని, అగ్రరాజ్యం అమెరికాతో సహా పలు ప్రపంచ దేశాలకు భారత్ ప్రస్తుతం తనవంతుగా సాయం చేస్తున్న విషయాన్ని కపిల్ గుర్తు చేశాడు.

భారత ప్రభుత్వానికి నిధుల కొరత ఏమాత్రం లేదని, పైగా భారత క్రికెట్ బోర్డే 51 కోట్ల రూపాయల భారీమొత్తాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి అందచేసిందని కపిల్ తెలిపాడు.

ఆరుమాసాలపాటు క్రికెట్ వద్దు….

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కరోనా బారిన పడకుండా ప్రజల్ని ఏవిధంగా కాపాడాలన్నదే ప్రధానమని, ఏ దేశానికి ఆదేశానికి ప్రభుత్వాలు ఉన్నాయని, తమ ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపైనే ఉంటుందంటూ కపిల్ చురకలంటించాడు.

వచ్చే ఆరుమాసాలపాటు క్రికెట్ గురించి అందరూ మరచిపోతేనే మంచిదని కపిల్ సలహా ఇచ్చాడు. ప్రజలు, ప్రభుత్వాలు కరోనా వైరస్ భయంతో ఓ వైపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్న వాస్తవాన్ని బాధ్యత కలిగిన ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలని సలహా ఇచ్చాడు.

మండేలానే అందరికీ ఆదర్శం…

మనదేశంలో అందరిబాగు కోసం ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటిస్తే…కొందరు ఇంటిపట్టునే గడపడానికి నానాపాట్లు పడుతున్నారని, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా 27 సంవత్సరాలపాటు ఇరుకు గదిలో అప్పటి శ్వేతజాతి ప్రభుత్వం నిర్భందాన్ని అనుభవించారని, మనం మాత్రం 21 రోజులపాటు…. మన ఇంట్లోనే కుటుంబసభ్యులతో గడపలేకపోడాన్ని మించిన విషాదం మరొకటి లేదని అన్నాడు.

First Published:  9 April 2020 12:46 PM IST
Next Story