Telugu Global
National

పాలమూరు కూలీలకు ఏపీ సర్కార్ అండ

లాక్‌డౌన్‌ కాలంలో ఏపీ సర్కార్‌ మానవత్వం చాటుకుంది. పాత మహబూబ్‌నగర్‌ ఇప్పటి గద్వాల జిల్లా నుంచి వెళ్లిన రైతు కూలీలను ఆదుకుంది. వారికి అండగా నిలిచింది. లాక్‌డౌన్‌లో వారి సమస్యలు తెలుసుకున్న వెంటనే వారికి నిత్యావసరాలు పంపించింది, ఆదుకుంది. గద్వాల నుంచి గుంటూరు జిల్లా వట్టి చెరుకూరుకు మిర్చి కోత కూలీలు వెళ్లారు. ప్రతి ఏటా ఇలా కూలీకి అక్కడికి వెళతారు. ఓ చేనులో గంపగుత్తగా మాట్లాడి మిర్చి కోత కోస్తారు. ఇలా చాలామంది గ్రూపులు గ్రూపులుగా […]

పాలమూరు కూలీలకు ఏపీ సర్కార్ అండ
X

లాక్‌డౌన్‌ కాలంలో ఏపీ సర్కార్‌ మానవత్వం చాటుకుంది. పాత మహబూబ్‌నగర్‌ ఇప్పటి గద్వాల జిల్లా నుంచి వెళ్లిన రైతు కూలీలను ఆదుకుంది. వారికి అండగా నిలిచింది. లాక్‌డౌన్‌లో వారి సమస్యలు తెలుసుకున్న వెంటనే వారికి నిత్యావసరాలు పంపించింది, ఆదుకుంది.

గద్వాల నుంచి గుంటూరు జిల్లా వట్టి చెరుకూరుకు మిర్చి కోత కూలీలు వెళ్లారు. ప్రతి ఏటా ఇలా కూలీకి అక్కడికి వెళతారు. ఓ చేనులో గంపగుత్తగా మాట్లాడి మిర్చి కోత కోస్తారు. ఇలా చాలామంది గ్రూపులు గ్రూపులుగా అక్కడికి వెళతారు. అయితే ఈ సారి కూడా అలాగే వెళ్లారు. అయితే లాక్‌డౌన్‌ కారణంతో వారు వెంట తీసుకెళ్లిన రేషన్‌ సరుకులు అయిపోయాయి. కొనడానికి డబ్బుల్లేవు. పరదా పట్టల డేరాల్లో ఇబ్బంది పడుతున్నామని… మా ఊరు పోవటానికి లేకుండా పోయిందని…. కాస్త అప్పు ఇప్పిస్తే పనులు చేసి తీర్చుకొంటాం అని అక్కడి వారిని వారు అడిగారు.

ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే కొందరు తీసుకెళ్లారు. దీంతో వెంటనే ప్రత్తిపాడు ఎమ్మెల్యే , హోమ్ మినిష్టర్ మేకతోటి సుచరిత స్పందించారు. రాత్రికి రాత్రి మంగళగిరి నుండి నిత్యావసరాల కిట్స్ తెప్పించి ఉదయమే రైతు కూలీలకు అందజేశారు. వారం తర్వాత మళ్లీ వారానికి సరిపడే సరకులు అందజేస్తామని అధికారులు చెప్పారు. వారిని దగ్గరలోని ఫంక్షన్‌హాల్‌లోకి మార్చేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇలాంటి రైతు కూలీలు ఎక్కడైనా ఇబ్బంది పడితే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు. క్షణాల్లో సహాయం అందించేందుకు తాము అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

First Published:  9 April 2020 4:13 AM IST
Next Story