కరోనాపై పోరాటం... కారునే ఇల్లుగా మార్చుకున్న డాక్టర్
ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా వైరస్‌పై ముందు వరుసలో నిలబడి పోరాడుతున్నది వైద్య సిబ్బందే. ఎంతో మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది తమకు ఆ వ్యాది సోకుతుందనే భయం లేకుండా నిరంతరం రోగులకు చికిత్స చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది వారి కుటుంబాలను వదిలి హోటల్స్‌లో ఉండటమో.. ప్రభుత్వం కల్పించిన వసతీ గృహాల్లో ఉండటమో చేస్తున్నారు. కరోనా బాధితులకు సేవలు చేసి తిరిగి ఇండ్లకు వెళితే కుటుంబ సభ్యులకు ఆ వ్యాది సోకుతుందేమో అనే అనుమానంతో […]
ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా వైరస్‌పై ముందు వరుసలో నిలబడి పోరాడుతున్నది వైద్య సిబ్బందే. ఎంతో మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది తమకు ఆ వ్యాది సోకుతుందనే భయం లేకుండా నిరంతరం రోగులకు చికిత్స చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది వారి కుటుంబాలను వదిలి హోటల్స్‌లో ఉండటమో.. ప్రభుత్వం కల్పించిన వసతీ గృహాల్లో ఉండటమో చేస్తున్నారు.
కరోనా బాధితులకు సేవలు చేసి తిరిగి ఇండ్లకు వెళితే కుటుంబ సభ్యులకు ఆ వ్యాది సోకుతుందేమో అనే అనుమానంతో చాలా మంది ఇండ్లకు దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలో భోపాల్‌కు చెందిన ఒక డాక్టర్ కారునే ఇల్లుగా మార్చుకున్నారు. భోపాల్‌లోని జేపీ హాస్పిటల్‌లో కరోనా బాధితులకు చికిత్సలు అందిస్తున్నారు. అక్కడ డాక్టర్ సచిన్ నాయక్ కూడా పని చేస్తున్నారు.
దీంతో ఆయన గత కొన్ని రోజులుగా ఇంటికి వెళ్లకుండా.. కుటుంబ సభ్యులను కలువకుండా ఆసుపత్రి ఆవరణలోనే ఉంటున్నారు. అక్కడే తన కారును పార్క్ చేసి దానినే ఇల్లులా మార్చేసుకున్నారు. ఆ కారులో తనకు కావలసిన నిత్యావసరాలతో పాటు బుక్స్, చిన్న బెడ్ లాంటివి ఏర్పాటు చేసుకున్నారు. కాగా, కారులో డాక్టర్ సచిన్ పుస్తకం చదువుతూ ఉన్న ఫొటో ఒకటి వైరల్‌గా మారింది.
आप जैसे #COVID19 के विरुद्ध युद्ध लड़ रहे योद्धाओं का मैं और सम्पूर्ण मध्यप्रदेश अभिनन्दन करता है। इसी संकल्प के साथ हम सब निरंतर आगे बढ़ें, तो यह महायुद्ध और जल्द जीत सकेंगे। सचिन जी, आपके जज्बे को सलाम! #CovidWarriors#IndiaFightsCarona https://t.co/2r2INV4m4a
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) April 7, 2020
డాక్టర్ సచిన్ ఫొటోను చూసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. ”కోవిడ్ 19 మహమ్మారిని తరిమి కొట్టేందుకు పోరాడుతున్న సైనికులు మీరు.. నేను, యావత్ మధ్యప్రదేశ్ ప్రజల నుంచి ఇవే మా వందనాలు, ఈ మహా యుద్దంలో త్వరగా విజయం సాధించేందుకు ఇదే స్పూర్తితో ముందుకు వెళ్దాం. సచిన్ మీ సేవలకు సలాం” అని సీఎం ట్వీట్ చేశారు. సచిన్ సేవలను పలువురు కొనియాడుతున్నారు.