Telugu Global
International

కొహ్లీ భజనలో కంగారూ క్రికెటర్లు?

ఐపీఎల్ కాంట్రాక్టుల కోసమేనంటూ విమర్శలు ప్రపంచ క్రికెట్లో నోటిదురదకు మరో పేరు ఆస్ట్ర్రేలియన్ క్రికెటర్లు. స్లెడ్జింగ్ ను అస్త్రంగా చేసుకొని …సూటిపోటి మాటలతో ప్రత్యర్థిజట్లలోని ప్రధాన ఆటగాళ్లను మానసికంగా వేధించడం, రెచ్చగొట్టడం, ఏకాగ్రత దెబ్బ తీయటంలో కంగారూల తర్వాతే ఎవరైనా. అయితే… తమదేశ పర్యటనకు త్వరలో భారతజట్టు రానుందని, ఆ సమయంలో… భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ బ్యాటింగ్ కు దిగిన సమయంలో… తమ ఆటగాళ్లెవ్వరూ నోటికి పనిచెప్పే సాహసం చేయబోరని, ఇదంతా ఐపీఎల్ కాంట్రాక్టుల కోసమేనంటూ ఆస్ట్ర్రేలియా […]

కొహ్లీ భజనలో కంగారూ క్రికెటర్లు?
X
  • ఐపీఎల్ కాంట్రాక్టుల కోసమేనంటూ విమర్శలు

ప్రపంచ క్రికెట్లో నోటిదురదకు మరో పేరు ఆస్ట్ర్రేలియన్ క్రికెటర్లు. స్లెడ్జింగ్ ను అస్త్రంగా చేసుకొని …సూటిపోటి మాటలతో ప్రత్యర్థిజట్లలోని ప్రధాన ఆటగాళ్లను మానసికంగా వేధించడం, రెచ్చగొట్టడం, ఏకాగ్రత దెబ్బ తీయటంలో కంగారూల తర్వాతే ఎవరైనా.

అయితే… తమదేశ పర్యటనకు త్వరలో భారతజట్టు రానుందని, ఆ సమయంలో… భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ బ్యాటింగ్ కు దిగిన సమయంలో… తమ ఆటగాళ్లెవ్వరూ నోటికి పనిచెప్పే సాహసం చేయబోరని, ఇదంతా ఐపీఎల్ కాంట్రాక్టుల కోసమేనంటూ ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

అయితే… ఈ ఆరోపణ అర్థంపర్థం లేనిదంటూ కంగారూ టెస్ట్ కెప్టెన్ టిమ్ పెయిన్ మండిపడ్డాడు. 2018-19 సిరీస్ నుంచే తాము కొహ్లీ పట్ల ఓ వ్యూహం పాటిస్తున్నామని…క్రీజులోకి ప్రశాంతంగా రానిచ్చి తప్పులు చేసేలా తమ బౌలర్లు అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నారని గుర్తు చేశాడు.

ఐపీఎల్ కాంట్రాక్టుల కోసం కొహ్లీకి తమ ఆటగాళ్లు భజన చేయాల్సిన పనిలేదని, కాకా పట్టాల్సిన పని అంతకంటే లేదని చెప్పాడు. తమతమ జట్లలోకి… ప్రతిభ, అవసరాల మేరకే ఫ్రాంచైజీలు విదేశీ క్రికెటర్లను వేలం ద్వారా సొంతం చేసుకొంటూ వస్తున్నాయన్న వాస్తవం క్లార్క్ కు తెలియదా అంటూ టిమ్ పెయిన్ ప్రశ్నించాడు.

ఐపీఎల్ లో ఆడుతున్న కంగారూ క్రికెటర్లందరూ కేవలం తమ ప్రతిభ ఆధారంగానే కాంట్రాక్టులు దక్కించుకొంటున్నారని, కొహ్లీ లాంటి ఆటగాళ్ల దయాదాక్షిణ్యాల పైన ఆధారపడి మాత్రం కాదని ఆస్ట్ర్రేలియా టెస్ట్ కెప్టెన్ తేల్చి చెప్పాడు.

ఐపీఎల్ ఫ్రాంచైజీ యాజమాన్యాలను విరాట్ కొహ్లీ ప్రభావితం చేస్తాడని తాను అనుకోడం లేదని టిమ్ పెయిన్ తెలిపాడు.

టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు ఆస్ట్ర్రేలియాతో టెస్ట్, వన్డే సిరీస్ లు ఆడాల్సి ఉంది. అయితే..కరోనా వైరస్ కారణంగా ప్రపంచకప్ తో పాటు… భారతజట్టు టూర్ సైతం అయోమయంలో చిక్కుకొంది.

First Published:  9 April 2020 12:38 PM IST
Next Story