Telugu Global
International

24 గంటల్లో 731 మంది మృతి.... శవాల దిబ్బగా మారిన న్యూయార్క్‌

కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అమెరికా అల్లాడుతోంది. ఇప్పటివరకూ అమెరికాలోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఇక న్యూయార్క్‌లో మాత్రం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. 24 గంటల్లో 731 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకూ 5,500 మంది ఒక్క న్యూయార్క్‌లోనే చనిపోయారు. ఇంతకుముందు 24 గంటల్లో 630 మంది చనిపోయారు. అమెరికాలో ఇప్పటివరకూ మొత్తం 11 వేలకు పైగా మంది కరోనాకు బలయ్యారు. న్యూయార్క్‌లో కూడా భౌతిక దూరం- సోషల్‌ డిస్టెన్స్‌ ఫలితాలు ఇస్తోంది. అందుకే అక్కడి అధికారులు […]

24 గంటల్లో 731 మంది మృతి.... శవాల దిబ్బగా మారిన న్యూయార్క్‌
X

కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అమెరికా అల్లాడుతోంది. ఇప్పటివరకూ అమెరికాలోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఇక న్యూయార్క్‌లో మాత్రం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. 24 గంటల్లో 731 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకూ 5,500 మంది ఒక్క న్యూయార్క్‌లోనే చనిపోయారు. ఇంతకుముందు 24 గంటల్లో 630 మంది చనిపోయారు. అమెరికాలో ఇప్పటివరకూ మొత్తం 11 వేలకు పైగా మంది కరోనాకు బలయ్యారు.

న్యూయార్క్‌లో కూడా భౌతిక దూరం- సోషల్‌ డిస్టెన్స్‌ ఫలితాలు ఇస్తోంది. అందుకే అక్కడి అధికారులు కూడా సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని పదేపదే కోరుతున్నారు. ఈ చర్యలు పాటించిన చోట కేసులు తక్కువగా ఉన్నాయని తేలింది. దీంతో అవసరమైతే తప్ప బయటకు రావొద్దు అని కోరుతున్నారు.

ఈ నెల చివరి వరకూ లాక్‌డౌన్ కొనసాగిస్తున్నట్లు న్యూయార్క్‌ గవర్నర్‌ చెప్పారు. ఏప్రిల్‌ 29 వరకు స్కూల్స్‌, ఇతర సంస్థలు మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. ఎప్పుడు పరిస్థితి కంట్రోల్‌లోకి వస్తుందో చెప్పలేమని న్యూయార్క్‌ మేయర్‌ బిల్‌ డి బాసియో చెప్పారు.

First Published:  8 April 2020 2:20 AM IST
Next Story