Telugu Global
National

ఫేక్‌ ఎం.ఏ పట్టా చిక్కుల్లో నిజామాబాద్‌ ఎంపీ !

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ కొత్త చిక్కుల్లో పడ్డాడు. టీఆర్‌ఎస్‌ నేతలు ఆయనపై ఇప్పుడు కొత్త ఆరోపణలు చేశారు. ఆయనది ఫేక్‌ డిగ్రీ అంటూ పోస్టులు పెడుతున్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ఎంక్వైరీ చేస్తే…ఆయన అసలు ఎంఏ చదవలేదని తేలిందట. ఎంపీగా గెలిచినప్పటి నుంచి అర్వింద్‌ దూకుడు మీద ఉన్నాడు. కవిత ఓడిపోయిన తర్వాత ఈయన గురించి టీఆర్‌ఎస్‌ శ్రేణులు దృష్టి పెట్టాయి. ఇప్పుడు ఏకంగా ఈ ఫేక్ డిగ్రీ విషయంలో ఆయన దొరికినట్లు ఆధారాలను కూడా చూపెడుతున్నారు. […]

ఫేక్‌ ఎం.ఏ పట్టా చిక్కుల్లో నిజామాబాద్‌ ఎంపీ !
X

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ కొత్త చిక్కుల్లో పడ్డాడు. టీఆర్‌ఎస్‌ నేతలు ఆయనపై ఇప్పుడు కొత్త ఆరోపణలు చేశారు. ఆయనది ఫేక్‌ డిగ్రీ అంటూ పోస్టులు పెడుతున్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ఎంక్వైరీ చేస్తే…ఆయన అసలు ఎంఏ చదవలేదని తేలిందట.

ఎంపీగా గెలిచినప్పటి నుంచి అర్వింద్‌ దూకుడు మీద ఉన్నాడు. కవిత ఓడిపోయిన తర్వాత ఈయన గురించి టీఆర్‌ఎస్‌ శ్రేణులు దృష్టి పెట్టాయి. ఇప్పుడు ఏకంగా ఈ ఫేక్ డిగ్రీ విషయంలో ఆయన దొరికినట్లు ఆధారాలను కూడా చూపెడుతున్నారు.

ఇప్పటికే ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని జనార్ధన్‌ రాయ్‌ యూనివర్శిటీ నుంచి 2018లో అర్వింద్‌ ఎం.ఏ పట్టా పొందినట్లు తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నాడు.

అయితే ఆయన ఎం.ఏ ఆ యూనివర్శిటీలో చదివారా? లేదా? అని టీఆర్‌ఎస్‌ శ్రేణులు యూనివర్శిటీకి లేఖ రాశాయి. ధర్మపురి అర్వింద్‌ సన్నాఫ్‌ ధర్మపురి శ్రీనివాస్‌ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో తమ దగ్గర పాసైనట్లు రికార్డులో లేదని యూనివర్శిటీ డైరెక్టర్‌ ప్రకాష్‌ శర్మ సమాధానం ఇచ్చారు.

ఫేక్‌ డిగ్రీ పెట్టిన అర్వింద్‌పై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు కోరారు. అయితే ఇంతకుముందు కూడా ప్రధానితో పాటు స్మృతి ఇరానీ డిగ్రీ సర్టిఫికెట్లపై వివాదం చెలరేగింది. నాలుగు రోజులు నడిచాయి. ఆ తర్వాత అందరూ మరిచిపోయారు. ఇప్పుడు టీఆర్ఎస్‌ నేతల ఆరోపణలకు అర్వింద్‌ ఎలా సమాధానం ఇస్తారో చూడాలి.

First Published:  8 April 2020 2:43 PM IST
Next Story