Telugu Global
National

కరోనా కిట్లు వచ్చేశాయ్... 55 నిముషాల్లోనే నిర్థారణ

తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు… దేశ వ్యాప్తంగా కరోనా కిట్ల కొరత ఉంది. ఈ వైరస్ బారిన పడిన వారు మనం ఊహించలేనంత మంది దేశంలో ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఎక్కువ మందికి పరీక్షలు జరపడం.. వారికి వైరస్ సోకిందో లేదో నిర్థారించడం అన్నది.. చాలా కష్టతరంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో.. చీకటిలో వెలుగు రేఖలాంటి ఊరట కల్పించింది విశాఖ మెడ్ టెక్ జోన్ సంస్థ. కరోనా పరీక్షల కిట్లను ఈ సంస్థ తయారు చేస్తోంది. […]

కరోనా కిట్లు వచ్చేశాయ్... 55 నిముషాల్లోనే నిర్థారణ
X

తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు… దేశ వ్యాప్తంగా కరోనా కిట్ల కొరత ఉంది. ఈ వైరస్ బారిన పడిన వారు మనం ఊహించలేనంత మంది దేశంలో ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఎక్కువ మందికి పరీక్షలు జరపడం.. వారికి వైరస్ సోకిందో లేదో నిర్థారించడం అన్నది.. చాలా కష్టతరంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో.. చీకటిలో వెలుగు రేఖలాంటి ఊరట కల్పించింది విశాఖ మెడ్ టెక్ జోన్ సంస్థ.

కరోనా పరీక్షల కిట్లను ఈ సంస్థ తయారు చేస్తోంది. ఇప్పటికే వంద కిట్లను సిద్ధం చేసింది. మరో 4 వందల కిట్లు సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ 5 వందల కరోనా టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి తెచ్చి.. వాటిని ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా పరీక్షలకు అంకితం చేసేందుకు వడివడిగా విశాఖ మెడ్ టెక్ జోన్ అడుగులు వేస్తోంది. అలాగే.. నెలలోపు ఏకంగా 25 వేల కిట్ల తయారీకి కూడా ప్రణాళికలు సిద్ధం చేసి.. విజయవంతంగా అమలు చేస్తోంది.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ కిట్లు అందుబాటులోకి వస్తే.. కరోనా నిర్థారణ పరీక్షలను కేవలం 55 నిముషాల్లో చేసేయవచ్చు. అంతటి సామర్థ్యం ఉన్న కిట్లు డాక్టర్లు, లాట్ టెక్నీషియన్ల చేతికి వచ్చిందంటే చాలు… ప్రజల్లో ఎందరు కరోనా సోకిన వాళ్లు ఉన్నారన్నది తెలుసుకోవడం కాస్త సులభతరం అవుతుంది. వేగంగా పరీక్షలు చేసేందుకు అవకాశం కలుగుతుంది. అయితే.. ప్రస్తుతం సిద్ధమైన 100 కరోనా కిట్లను తయారీదారులు.. భారతీయ వైద్య పరిశోధన కౌన్సిల్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ – ఐసీఎంఆర్) కు పంపించారు.

First Published:  8 April 2020 3:10 AM IST
Next Story