Telugu Global
National

విద్యుత్ బిల్లులకు నో టెన్షన్... తెలంగాణలో కొత్త ప్రిపరేషన్

కరోనా లాక్ డౌన్ ఆంక్షల కారణంగా ప్రజలు దాదాపుగా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఫలితంగా విద్యుత్ వాడకం కూడా విపరీతంగానే నమోదవుతోంది. పైగా.. వేసవి సెలవులు కూడా వచ్చేశాయి. ఇంకో నెల పాటు లాక్ డౌన్ పొడిగింపు సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ నెల 8వ తేదీ వచ్చినా.. ఇప్పటికీ విద్యుత్ సిబ్బంది మాత్రం ఇళ్లకు రాలేదు. మీటరు రీడింగు తీసుకోలేదు. దీంతో.. ఒకేసారి 2 నెలల బిల్లు తీస్తే.. డబ్బులు భారీగా కట్టాల్సివస్తుందేమో అని […]

విద్యుత్ బిల్లులకు నో టెన్షన్... తెలంగాణలో కొత్త ప్రిపరేషన్
X

కరోనా లాక్ డౌన్ ఆంక్షల కారణంగా ప్రజలు దాదాపుగా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఫలితంగా విద్యుత్ వాడకం కూడా విపరీతంగానే నమోదవుతోంది. పైగా.. వేసవి సెలవులు కూడా వచ్చేశాయి. ఇంకో నెల పాటు లాక్ డౌన్ పొడిగింపు సూచనలు కనిపిస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో ఈ నెల 8వ తేదీ వచ్చినా.. ఇప్పటికీ విద్యుత్ సిబ్బంది మాత్రం ఇళ్లకు రాలేదు. మీటరు రీడింగు తీసుకోలేదు. దీంతో.. ఒకేసారి 2 నెలల బిల్లు తీస్తే.. డబ్బులు భారీగా కట్టాల్సివస్తుందేమో అని దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు.

ఇలాంటి వారికి… తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఓ దారి చూపించింది. తెలంగాణలో నూతన విధానాన్ని అమలు చేయబోతోంది. అదేంటంటే… గత ఏడాది.. అంటే 2019లో.. మార్చి నెల విద్యుత్ వాడకానికి ఎంత మొత్తం చెల్లించారో గుర్తుంటే చాలు. ఆ మొత్తాన్ని ఈ నెలకు కూడా ఆన్ లైన్ లో చెల్లిస్తే సరిపోతుంది. ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత.. సిబ్బంది వచ్చి రీడింగ్ తీసుకున్నప్పుడు ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తారు. ప్రస్తుత మార్చ్ నెలకు ఎంత వాడకం అయ్యింది లెక్కిస్తారు. డబ్బులు ఎక్కువ కడితే తర్వాత నెలకు ఆ మొత్తాన్ని తగ్గిస్తారు. తక్కువ కడితే మిగిలిన మొత్తాన్ని కలిపి తర్వాతి బిల్లును జారీ చేస్తారు.

ఈ ప్రక్రియకు సంబంధించి త్వరలోనే ప్రజలకు మెసేజ్ లు వెళ్లనున్నాయి. గత ఏడాది మార్చి నెలకు సంబంధించిన బిల్లు మొత్తం కూడా పంపే ఏర్పాటు జరుగుతోంది.

పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలకైతే.. గత ఏడాది మార్చి నెలలో కట్టిన మొత్తానికి సగం చెల్లిస్తే చాలన్న వెసులుబాటును కూడా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను మిగతా రాష్ట్రాల విద్యుత్ మండళ్లు కూడా పరిశీలిస్తున్నాయి. ఆదాయం పూర్తిగా తగ్గిపోతే నిర్వహణ కష్టతరమవుతుందన్న ఆలోచనలో ఉన్న విద్యుత్ మండళ్లు.. ఈ మార్గాన్ని అనుసరిస్తే కాస్త ఆర్థిక వెసులుబాటు ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది.

First Published:  8 April 2020 3:44 AM IST
Next Story