కరోనా సేవలకు ప్రైవేట్ హాస్పిటళ్ల వెంటిలేటర్లు
కరోనా సోకిన వారికి అన్ని రకాలుగా వైద్య చికిత్స అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందుబాటులో ఉన్న అవకాశాలన్నిటినీ పరిశీలిస్తోంది. ఇప్పటికే ప్రైవేటు హాస్పిటళ్లను.. ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకునేలా ఉత్తర్వులు ఇచ్చిన జగన్ సర్కారు.. తాజాగా మరో కీలకమైన ప్రకటన చేసింది. రాష్ట్రంలో కొవిడ్ 19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న దరిమిలా.. జిల్లాకో ప్రత్యేక ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. పూర్తిగా.. కరోనా పేషెంట్లకు చికిత్స కోసమే అందుబాటులోకి రానున్న వీటిలో.. వెంటిలేటర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని […]
కరోనా సోకిన వారికి అన్ని రకాలుగా వైద్య చికిత్స అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందుబాటులో ఉన్న అవకాశాలన్నిటినీ పరిశీలిస్తోంది. ఇప్పటికే ప్రైవేటు హాస్పిటళ్లను.. ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకునేలా ఉత్తర్వులు ఇచ్చిన జగన్ సర్కారు.. తాజాగా మరో కీలకమైన ప్రకటన చేసింది. రాష్ట్రంలో కొవిడ్ 19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న దరిమిలా.. జిల్లాకో ప్రత్యేక ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
పూర్తిగా.. కరోనా పేషెంట్లకు చికిత్స కోసమే అందుబాటులోకి రానున్న వీటిలో.. వెంటిలేటర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని జగన్ ప్రభుత్వం భావించింది. అందుకే.. ప్రైవేట్ హాస్పిటళ్లలో అందుబాటులో ఉన్నవాటిని ప్రభుత్వం ఏర్పాటు చేసే కొవిడ్ 19 ఆసుపత్రుల్లో వినియోగించుకుంటామని చెప్పింది. అంతే కాదు… ఆ కాలానికి అద్దె కూడా చెల్లిస్తామని హాస్పిటళ్ల యాజమాన్యాలకు హామీ ఇచ్చింది. వాటిని సురక్షితంగా అందజేసే బాధ్యత కూడా తమదేనని చెప్పింది.
కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న తరుణంలో ఇలాంటి చర్యలు.. తీసుకోవాల్సిందే. ఎందుకంటే.. మంగళవారం నాటి అధికారిక లెక్కల ప్రకారం.. కేవలం ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది. హమ్మయ్య అని అధికారులు ఊపిరి తీసుకునేలోగానే.. ఇవాళ బుధవారం తెల్లారేసరికి మరో 10 కేసులు పాజిటివ్ అని ఫలితాలు రావడం.. కేసుల సంఖ్య 314కు చేరడం.. అందరినీ కలవరపరుస్తోంది.
అందుకే.. జగన్ ప్రభుత్వం జిల్లాకో ఆసుపత్రి ఏర్పాటు చేసి.. పాజిటివ్ పేషెంట్లకు సత్వర చికిత్స అందించేందుకు ఉన్న అన్ని మార్గాలను అందుబాటులోకి తెస్తోంది.