Telugu Global
National

కరోనా సాయానికి.... గోపిచంద్ 26 లక్షలు, మిథాలీరాజ్ 10 లక్షల విరాళం...

10 లక్షల విరాళం ప్రకటించిన మిథాలీరాజ్ బట్లర్ షర్ట్ వేలానికి కళ్లు చెదిరే ధర భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్…కరోనా వైరస్ బాధితుల నిధికి మూడు భాగాలుగా 26 లక్షల రూపాయలు ప్రకటించాడు. ప్రధానమంత్రి సహాయనిధికి 11 లక్షల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 5 లక్షలు, తెలంగాణా ముఖ్యమంత్రి సహాయనిధికి 10 లక్షలు ఇస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుత కష్టకాలంలో, విపత్కర పరిస్థితిలో తాను ఇచ్చింది చాలా చిన్నమొత్తమేనని తెలిపాడు. ప్రపంచ దేశాలనే గడగడలాడిస్తున్న […]

కరోనా సాయానికి.... గోపిచంద్ 26 లక్షలు, మిథాలీరాజ్ 10 లక్షల విరాళం...
X
  • 10 లక్షల విరాళం ప్రకటించిన మిథాలీరాజ్
  • బట్లర్ షర్ట్ వేలానికి కళ్లు చెదిరే ధర

భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్…కరోనా వైరస్ బాధితుల నిధికి మూడు భాగాలుగా 26 లక్షల రూపాయలు ప్రకటించాడు. ప్రధానమంత్రి సహాయనిధికి 11 లక్షల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 5 లక్షలు, తెలంగాణా ముఖ్యమంత్రి సహాయనిధికి 10 లక్షలు ఇస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుత కష్టకాలంలో, విపత్కర పరిస్థితిలో తాను ఇచ్చింది చాలా చిన్నమొత్తమేనని తెలిపాడు.

ప్రపంచ దేశాలనే గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి దెబ్బకు 22 దేశాలు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటిస్తే.. మరో 90 దేశాలు పాక్షిక లాక్ డౌన్ పాటిస్తున్నాయి. మొత్తం 10 లక్షల మందికి పైగా ఈ వైరస్ సోకింది. భారత్ లో దాదాపు 4వేల మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా ఇప్పటికే 100 మందికి పైగా మృతి చెందారు.

భారతప్రభుత్వం, వివిధ రాష్ట్ర్ర ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోడంతో 130 కోట్ల భారీజనాభా ఉన్నా… కరోనాను నియంత్రణలో ఉంచడంలో సఫలం కాగలిగింది.

బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు తనవంతుగా 10 లక్షల రూపాయలు, భారత మహిళా స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ 10 లక్షలు రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు.

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, మాజీ కెప్టెన్ అనీల్ కుంబ్లే తమవంతుగా భారీసాయం అందచేసినా… అది ఎంత మొత్తమో ప్రకటించడానికి ఆసక్తి చూపలేదు. క్యూస్పోర్టు కింగ్ పంకజ్ అద్వానీ, హాకీ దిగ్గజం ధనరాజ్ పిళ్లై…చెరో ఐదులక్షల రూపాయలు…ప్రధానమంత్రి సహాయనిధికి జమచేస్తున్నట్లు ప్రకటించారు.

బట్లర్ షర్టు వేలం సూపర్ హిట్….

ఇంగ్లండ్ సూపర్ హిట్టర్ జోస్ బట్లర్…కరోనా వైరస్ బాధితుల సహాయం కోసం తాను ప్రపంచకప్ ఫైనల్ ఆడుతున్న సమయంలో ధరించిన టీ-20 షర్టును ఆన్ లైన్ ద్వారా వేలానికి ఉంచాడు.
ప్రపంచకప్ ఫైనల్స్ టీ-20 షర్టుకు వేలంలో రికార్డు స్థాయిలో 80వేల డాలర్లు ధర పలికింది. ఈ మొత్తం 65వేల పౌండ్లకు సమానం.

ఇంత ధర పలుకుతుందని తాను ఊహించలేదని, తన ఇంగ్లండ్ జెర్సీ వేలానికి ఓ అర్థం, పరమార్థం చేకూరాయంటూ బట్లర్ సంతోషం వ్యక్తం చేశాడు.

మరోవైపు… ఇంగ్లండ్ కాంట్రాక్టు క్రికెటర్లందరూ కలసి తమవంతుగా 5 లక్షల పౌండ్ల మొత్తాన్ని కరోనా సహాయనిధికి ఇస్తున్నట్లు ప్రకటించారు. మూడుమాసాల కాలం పాటు… క్రికెట్ కార్యకలాపాలు లాక్ డౌన్ కావడంతో… సెంట్రల్ కాంట్రాక్టు క్రికెటర్ల వేతనాలలో 20 శాతం కోత విధించినట్లు ఇప్పటికే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

First Published:  6 April 2020 9:00 PM GMT
Next Story