Telugu Global
International

లాక్‌డౌన్ పొడిగించమని మేం చెప్పలేదు బాబోయ్ " బీసీజీ

కరోనా వైరస్‌ను పూర్తిగా కట్టడి చేయాలంటే లాక్‌డౌనే సరైన పరిష్కారమని ప్రపంచవ్యాప్తంగా అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని సగం జనాభా లాక్‌డౌన్ కారణంగా ఇండ్లకే పరమియితమయ్యారు. మన దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి లాక్‌డౌన్ అమలులోనికి వచ్చింది. కాగా, మర్కజ్ ప్రార్థనలు వెలుగులోనికి వచ్చిన అనంతరం లాక్‌డౌన్ పొడిగించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ మరి కొన్ని రోజులు పొడిగించడం మేలని అన్నారు. ప్రధానికి కూడా […]

లాక్‌డౌన్ పొడిగించమని మేం చెప్పలేదు బాబోయ్  బీసీజీ
X

కరోనా వైరస్‌ను పూర్తిగా కట్టడి చేయాలంటే లాక్‌డౌనే సరైన పరిష్కారమని ప్రపంచవ్యాప్తంగా అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని సగం జనాభా లాక్‌డౌన్ కారణంగా ఇండ్లకే పరమియితమయ్యారు. మన దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి లాక్‌డౌన్ అమలులోనికి వచ్చింది. కాగా, మర్కజ్ ప్రార్థనలు వెలుగులోనికి వచ్చిన అనంతరం లాక్‌డౌన్ పొడిగించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలో సోమవారం ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ మరి కొన్ని రోజులు పొడిగించడం మేలని అన్నారు. ప్రధానికి కూడా ఈ విషయం నేను పలు మార్లు చెప్పానని ఆయన వెల్లడించారు. అంతే కాకుండా, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ఒక నివేదిక ఇచ్చిందని.. దాని ప్రకారం ఇండియాలో జూన్ 3 వరకు లాక్‌డౌన్ కొనసాగించకపోతే పరిస్థితులు చేయిదాటుతాయని హెచ్చరించినట్లు కేసీఆర్ చెప్పారు.

తాజాగా దీనిపై బీసీజీ స్పందించింది. లాక్‌డౌన్ పొడిగింపునకి సంబంధించి తాము ఎలాంటి నివేదిక ఇవ్వలేదని బీసీజీ స్పష్టం చేసింది.

‘భారత్, ప్రపంచానికి సంబంధించి లాక్‌డౌన్ పొడిగింపు విషయంలో మేం ఎలాంటి అంచనాలు వేయలేదు. మా పేరుతో వస్తున్న వార్తలను నమ్మకండి’ అని బీసీజీ తెలిపింది. బీసీజీ ఏకంగా సెప్టెంబర్ నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగించమన్నదంటూ కూడా కొన్ని మీడియా సంస్థలు వార్తలు వెలువరించాయి. కానీ ఇప్పుడు బీసీజీ అసలు మాకు అలాంటి వార్తలతో సంబంధం లేదని తెలియజేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి నిన్న కేసీఆర్‌కు బీసీజీ పేరుతో ఆ నివేదికను అందించిందెవరు అనే విషయం చర్చనీయాంశంగా మారింది.

First Published:  7 April 2020 7:04 AM IST
Next Story