'మా' అధ్యక్షుడు వీకే నరేష్ కరోనా విరాళం రూ. 11 లక్షలు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు వీకే నరేష్ తనలోని దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా మహమ్మారి తాండవం చేస్తున్న ఈ సమయంలో ‘మా’ సభ్యులకు అండగా నిలబడటం తన బాధ్యతగా భావించిన ఆయన తన వంతుగా 100 కుటుంబాలని దత్తత తీసుకుని ఒక్కో కుటుంబానికి రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 10 లక్షలు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. వారిలో ‘మా’ సర్వే చేయించిన 58 మంది సభ్యులకు ఇప్పటికే వారి బ్యాంక్ అకౌంట్‌లో రూ. […]
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు వీకే నరేష్ తనలోని దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా మహమ్మారి తాండవం చేస్తున్న ఈ సమయంలో ‘మా’ సభ్యులకు అండగా నిలబడటం తన బాధ్యతగా భావించిన ఆయన తన వంతుగా 100 కుటుంబాలని దత్తత తీసుకుని ఒక్కో కుటుంబానికి రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 10 లక్షలు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.
వారిలో ‘మా’ సర్వే చేయించిన 58 మంది సభ్యులకు ఇప్పటికే వారి బ్యాంక్ అకౌంట్‌లో రూ. 10,000 చొప్పున డిపాజిట్ చేశారు. అదేవిధంగా సినీ కార్మికులను ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి చైర్మన్‌గా ఏర్పాటైన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి తన వంతుగా మరో రూ. 1 లక్ష విరాళం అందజేస్తున్నట్లు నరేష్ ప్రకటించారు.
కరోనా మహమ్మారిని అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలనీ, అందరూ తమ తమ ఇళ్లల్లో సురక్షితంగా ఉండి, ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాలనీ ఆయన పిలుపునిచ్చారు.