లాక్‌డౌన్ ఎఫెక్ట్: టిక్‌టాక్‌తో పండగే పండగ !
లాక్‌డౌన్ కాలంలో జనం టైమ్ పాస్ ఎలా చేస్తున్నారు? సినిమాలు చూస్తున్నారా? న్యూస్ చానళ్లు చూస్తున్నారా? అమెజాన్ ప్రైమ్,నెట్‌ప్లిక్స్, జీ5, అహా యాప్‌లకే ఎంగేజ్ అవుతున్నారా? అసలు జనం ఏం చేస్తున్నారు? చాలా మందిలో ఇవే అనుమానాలు. ఇప్పటికే టీవీ రేటింగ్‌లు పెరిగాయి. న్యూస్ చానళ్ల వీక్షణం 30 శాతం పెరిగింది. టీవీల్లో వచ్చే సినిమాలను కూడా జనం వదిలిపెట్టడం లేదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా జనం ఉంటున్నారు. ఇంతకుముందు కంటే 30 శాతం […]
లాక్‌డౌన్ కాలంలో జనం టైమ్ పాస్ ఎలా చేస్తున్నారు? సినిమాలు చూస్తున్నారా? న్యూస్ చానళ్లు చూస్తున్నారా? అమెజాన్ ప్రైమ్,నెట్‌ప్లిక్స్, జీ5, అహా యాప్‌లకే ఎంగేజ్ అవుతున్నారా? అసలు జనం ఏం చేస్తున్నారు? చాలా మందిలో ఇవే అనుమానాలు. ఇప్పటికే టీవీ రేటింగ్‌లు పెరిగాయి. న్యూస్ చానళ్ల వీక్షణం 30 శాతం పెరిగింది. టీవీల్లో వచ్చే సినిమాలను కూడా జనం వదిలిపెట్టడం లేదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా జనం ఉంటున్నారు. ఇంతకుముందు కంటే 30 శాతం సోషల్‌మీడియా రెస్సాన్స్ రేట్ పెరిగింది.
అయితే లాక్‌డౌన్ ప్రకటించిన మార్చి 24 తర్వాత డేటా పరిశీలిస్తే…ఒక విషయం మాత్రం అర్ధమవుతోంది. టిక్‌టాక్ యాప్‌ను జనం విచ్చలవిడిగా డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియా కేటగిరిలో టిక్‌టాక్ యాప్‌నే జనం ఎక్కువగా డౌన్‌లోడ్ చేశారట.
ఆ తర్వాత వాట్సాప్, ఫేస్‌బుక్‌లు చోటు సంపాదించుకున్నాయి. గూగుల్ ప్లే, ఐఓఎస్ యాప్ ద్వారా మార్చి మొదటి వారంతో పోలిస్తే 20 శాతం డౌన్‌లోడ్‌లు పెరిగాయి. మొత్తానికి 49 లక్షల కొత్త డౌన్‌లోడ్‌లు నమోదు అయ్యాయి.
టిక్ టాక్, వాట్సాప్, ఫేస్‌బుక్ మొదటి మూడు స్థానాల్లో ఉంటే… హలో, ఇన్‌స్ట్రాగమ్, వీ మేట్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే టిక్‌టాక్ వీడియోలు అప్‌లోడ్ చేయడంతో పాటు… ఇన్‌స్ట్రాగమ్‌లో లైవ్ వీడియోలు విపరీతంగా పెరిగాయి.
ఇక గేమింగ్ యాప్స్‌కూడా విపరీతంగా డౌన్‌లోడ్ అయ్యాయట. అయితే కమ్యూనికేషన్ కేటగిరీలో అజ్‌తక్, జూమ్ క్లౌడ్ మీటింగ్స్, యూ వీడియో, ఇన్‌స్ట్రాగమ్, జీయో టీవీ, అమెజాన్ ప్రైమ్ యాప్‌లు ఎక్కువగా డౌన్‌లోడ్ చేశారట.
ఓవరల్‌గా చూసుకుంటే ఆజ్‌తక్, జూమ్ క్లౌడ్ మీటింగ్ యాప్‌లు 54, 56 ర్యాంకుల్లో ఉన్నాయి. లాక్‌డౌన్ పీరియడ్ కాలంలో టిక్‌టాక్‌లో 4.6 బిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇన్‌స్ట్రాగమ్‌లో 60 శాతం వ్యూస్ పెరిగాయి.
అయితే డేటింగ్ యాప్‌లు టిండర్, బూంబ్ల్ యాప్‌లు ఎక్కువగా డౌన్‌లోడ్ కాలేదట. అందరూ ఇంటికే పరిమితం కావడంతో ఈ డేటింగ్ యాప్‌లకు పెద్దగా గిరాకీ లేకుండా పోయిందట.