కరోనా దెబ్బకు హీరోల ప్లాన్స్ రివర్స్!
‘అనుకున్నదొక్కటీ…. అవుతున్నదొక్కటి’ అన్నట్లు ఉంది ప్రస్తుతం టాలీవుడ్ హీరోల పరిస్థితి. పక్కా ప్లానింగ్ వేసుకొని సినిమాలు చేసుకుంటూ పోతున్న హీరోలకు ఊహించని ఉపద్రవం కరోనా రూపంలో వచ్చింది. కరోనా భారత్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో తప్పని పరిస్థితిలో కేంద్రం లాక్ డౌన్ అమలు చేసింది. 21రోజుల లాక్ డౌన్ అమలులో భాగంగా సినిమా షూటింగ్ లు వాయిదా పడగా, థియేటర్లు మూతపడ్డాయి. దీంతో రోజువారీ సీనీ కార్మికులు ఇబ్బందులు పడుతుండగా వీరిని ఆదుకునేందుకు తాజాగా టాలీవుడ్ లో ‘సీసీసీ’ […]
‘అనుకున్నదొక్కటీ…. అవుతున్నదొక్కటి’ అన్నట్లు ఉంది ప్రస్తుతం టాలీవుడ్ హీరోల పరిస్థితి. పక్కా ప్లానింగ్ వేసుకొని సినిమాలు చేసుకుంటూ పోతున్న హీరోలకు ఊహించని ఉపద్రవం కరోనా రూపంలో వచ్చింది.
కరోనా భారత్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో తప్పని పరిస్థితిలో కేంద్రం లాక్ డౌన్ అమలు చేసింది. 21రోజుల లాక్ డౌన్ అమలులో భాగంగా సినిమా షూటింగ్ లు వాయిదా పడగా, థియేటర్లు మూతపడ్డాయి. దీంతో రోజువారీ సీనీ కార్మికులు ఇబ్బందులు పడుతుండగా వీరిని ఆదుకునేందుకు తాజాగా టాలీవుడ్ లో ‘సీసీసీ’ ఏర్పాటైంది. అయితే హీరోల ప్లానింగ్ మాత్రం పూర్తి రివర్స్ కావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థతి నెలకొంది.
భీష్మ రిలీజ్ టైంలో మంచి జోష్ మీద ఉన్న నితిన్… ఈ ఏడాది నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయని ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఒక్క సినిమా రావడమే గగనంగా మారింది. ఇది ఒక్క నితిన్ కే పరిమితం కాలేదు. దాదాపు అందరు హీరోల పరిస్థితి ఇలానే ఉంది.
నితిన్ ‘రంగ్ దే’ షూటింగ్ స్టేజ్ లోనే అది ఆగిపోయింది. కరోనా ఎఫెక్ట్ తో పెళ్లి కూడా వాయిదా పడింది. నాని, నిఖిల్, ప్రభాస్, బన్నీ, రామ్ చరణ్ ఇలా ప్రతీఒక్కరి సినిమా షూటింగ్ లు వాయిదా పడగా కొత్త సినిమాలు ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు.
కరోనా వల్ల మెగాస్టార్ చిరంజీవి లెక్క కూడా తప్పింది. ఆచార్య సినిమాను వంద రోజుల్లో పూర్తిచేయాలనుకున్న మెగాస్టార్ కు అనుకోని అడ్డంకిగా కరోనా వచ్చిపడింది. ఇండస్ట్రీలో అందరికంటే ముందే ‘ఆచార్య’ షూటింగ్ ఆపేశారు. చరణ్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాతో ఇప్పటికే చరణ్ సినిమాలకు చాలా గ్యాప్ వచ్చింది. ఈ మూవీ వాయిదా పడటంతో చరణ్ కొత్త ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెక్కేలా కన్పించడం లేదు. ఇంచుమించు ఎన్టీఆర్ పరిస్థితి ఇలానే ఉంది.
ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు ఇలానే ఉన్నాయి. ప్రభాస్ అయితే తన కొత్త సినిమా యూరోప్ షెడ్యూల్ ను మధ్యలోనే ఆపేసి వెనక్కి వచ్చేశాడు. కరోనా దెబ్బకు అసలు యూరోప్ లో అడుగుపెట్టాలంటేనే భయపడుతున్నారు జనం.
బన్నీ కూడా సుకుమార్ తో చేయాల్సిన సినిమాను ఈపాటికి స్టార్ట్ చేయాలి. కరోనా కారణంగా సినిమా షూట్ స్టార్ట్ కాలేదు.
అలాగే మహేష్ బాబు ‘సరిలేరునీకెవ్వరు’ తర్వాత మూవీ ప్రారంభం కాలేదు. సీనియర్ లు అయిన బాలకృష్ణ-బోయపాటి సినిమా, వెంకటేశ్-నారప్ప మూవీ, నాగార్జున-వైల్డ్ డాగ్ మూవీలు కరోనా ఎఫెక్ట్ తో వాయిదాపడ్డాయి. కరోనా ప్రభావం తగ్గాక కూడా సినిమాలపై కొన్నిరోజులు ప్రభావం ఉండేలా కన్పిస్తుంది.