Telugu Global
International

కరోనా దెబ్బకు మూతపడిన... "వైరస్ మ్యూజియం"!

ఏ ఇద్దరు కలిసినా.. ఏ టీవీ చూసినా.. ఏ పేపర్ తిరగేసినా.. ఇప్పుడు ఒకటే వార్త కనిపిస్తోంది. కరోనా వివరాలే అన్ని చోట్లా కనిపిస్తున్నాయి. ఇంతగా ఈ వైరస్ ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి కరోనా వైరస్ ఒక్కటే కాదు.. మరిన్ని వైరస్ ల గురించి అవగాహన కలిగించే మ్యూజియం వార్తల్లోకి వచ్చింది. నెదర్లాండ్స్ లోని  ఆమ్స్టర్డ్యామ్ లో ఈ వైరస్ ప్రదర్శనశాల ఉంది. కరోనా దెబ్బకు.. ఇది కూడా మూతపడింది. కానీ.. తన ప్రత్యేకతలతో వార్తల్లో నిలిచింది. […]

కరోనా దెబ్బకు మూతపడిన... వైరస్ మ్యూజియం!
X

ఏ ఇద్దరు కలిసినా.. ఏ టీవీ చూసినా.. ఏ పేపర్ తిరగేసినా.. ఇప్పుడు ఒకటే వార్త కనిపిస్తోంది. కరోనా వివరాలే అన్ని చోట్లా కనిపిస్తున్నాయి. ఇంతగా ఈ వైరస్ ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి కరోనా వైరస్ ఒక్కటే కాదు.. మరిన్ని వైరస్ ల గురించి అవగాహన కలిగించే మ్యూజియం వార్తల్లోకి వచ్చింది. నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డ్యామ్ లో ఈ వైరస్ ప్రదర్శనశాల ఉంది. కరోనా దెబ్బకు.. ఇది కూడా మూతపడింది. కానీ.. తన ప్రత్యేకతలతో వార్తల్లో నిలిచింది.

ఈ మ్యూజియం పేరు మైక్రోపియా. కంటికి కనిపించనంత చిన్నగా ఉండే వైరస్ ల గురించి ఇక్కడ ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు. అవి ఎలా ఏర్పడతాయి.. వాటి విస్తరణ ఎలా ఉంటుంది.. ప్రభావం ఏంటి.. అన్నది సంపూర్ణమైన వివరాలు తెలుపుతూ నమూనా చిత్రాలు ఉంటాయి. వీటిని చూసి తెలుసుకునేందుకు మైక్రోస్కోపులూ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అంతే కాదు.. మన శరీరంలో ఎలాంటి వైరస్ లు ఉన్నాయి.. అన్నది విశ్లేషించే బాడీ స్కానర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ వైరస్ లు ఎలా ఉంటాయి… వాటి ఆకారాలు ఎలా ఉంటాయన్నదీ తెలుసుకోవచ్చు.

ఇంతటి ప్రత్యేకమైన వైరస్ మ్యూజియం.. ప్రపంచంలో ఇదొక్కటే. ఇలాంటి ప్రాంతాన్నీ.. ఇప్పుడు కరోనా వైరస్ కాటేసింది. జనాన్ని భయాందోళనలకు గురి చేస్తోంది. లాక్ డౌన్ అమలు అవుతోంది. ఫలితంగా.. ఈ ప్రదర్శనశాల మూత పడింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాతే మళ్లీ తెరిచే అవకాశం ఉంది. తెరిచాక.. కరోనా వైరస్ నమూనాలనూ ఇక్కడ ప్రదర్శించాలన్న ఆకాంక్ష.. స్థానికుల్లో వ్యక్తం అవుతోంది. అది ఎంతవరకు నెరవేరుతుందన్నది ముందు ముందు తేలనుంది.

కరోనా ప్రబలుతున్న వేళ.. వైరస్ లకూ ఓ మ్యూజియం ఉందన్న వార్త అయితే.. చాలామందిని ఆకర్షిస్తోంది.

First Published:  6 April 2020 12:18 PM IST
Next Story