చైనాలో మళ్లీ కరోనా పంజా.... కొత్త కేసులతో కలకలం
చైనాలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త కేసులు బయటపడడంతో ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. చైనా డైలీ పత్రిక కథనం ప్రకారం కొత్తగా 30 కేసులు బయటపడ్డాయి. ఇందులో ఐదు లోకల్ ట్రాన్స్‌మిషన్ కేసులు. 25 మందికి కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో రెండోసారి దేశవ్యాప్తంగా మళ్లీ అలర్ట్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా మొత్తం కొత్త కేసులు వెయ్యి దాటాయి. లోకల్ ట్రాన్స్‌మిషన్ కేసులకు ఎక్కడి నుంచి వైరస్ సోకిందనే […]
చైనాలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త కేసులు బయటపడడంతో ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది.
చైనా డైలీ పత్రిక కథనం ప్రకారం కొత్తగా 30 కేసులు బయటపడ్డాయి. ఇందులో ఐదు లోకల్ ట్రాన్స్‌మిషన్ కేసులు. 25 మందికి కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో రెండోసారి దేశవ్యాప్తంగా మళ్లీ అలర్ట్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా మొత్తం కొత్త కేసులు వెయ్యి దాటాయి.
లోకల్ ట్రాన్స్‌మిషన్ కేసులకు ఎక్కడి నుంచి వైరస్ సోకిందనే దానిపై ముందుగా ఫోకస్ పెట్టారు. విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే వైరస్ వ్యాపించిందని అనుమానిస్తున్నారు. వైరస్ సోకిన వారిని క్వారంటైన్‌లో పెట్టారు. విదేశాల నుంచి వచ్చినవారికి పూర్తి పరీక్షలు నిర్వహించిన తర్వాతే దేశంలోనికి అనుమతి ఇస్తున్నారు. హుబాయ్ ప్రావెన్సిలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని అబ్జర్వేషన్‌లో పెట్టారు.
యాంటీబాడీ టెస్ట్‌తో పాటు న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్‌తో కరోనా అనుమానితులను పరీక్షించవచ్చని చైనా అధికారులు అంటున్నారు. కొందరిలో కరోనా సోకిన తర్వాత కూడా లక్షణాలు కనిపించడం లేదని… వారిని ఇలాంటి టెస్టుల ద్వారా కనుక్కోవచ్చని అంటున్నారు.
మొత్తానికి మళ్లీ చైనాలో కరోనా కలకలం కొనసాగుతోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ పంజా విసరడంతో…అధికారులు అలర్ట్ అయ్యారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు లో ప్రయాణించే వారికి పరీక్షలు చేసిన తర్వాతే అనుమతి ఇస్తున్నారు.